చిరంజీవి సినిమా షూటింగ్ లో తల్లి , బిడ్డ మృతి

0
80

సినిమా షూటింగ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది . చిరంజీవి సర్జ  , చేతన్ కుమార్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రణం .ప్రస్తుతం  ఈ సినిమా షూటింగ్ బాగలూరు ప్రాంతం వద్ద జరుగుతుంది . గ్యాస్ సిలిండర్ తో ఓ కార్ బ్లాస్టింగ్ చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశంలో అదే ప్రాంతానికి  చెందిన ఈషా ఖాన్ తల్లి సుయెరా భానులు సినిమా షూటింగ్ చూడడానికి వచ్చారు . 

ఆ పేలే సమయంలో ఎండా తీవ్రంగా ఉండడం తో ఆ గ్యాస్ సిలిండర్ పెళ్లి అక్కడ ఉన్న ఈ తల్లి బిడ్డల మీదకు దూసుకువచ్చి వారిని పొట్టన పెట్టుకుంది . ఈ ఘటన జరిగిన కొద్దీ నిమిషాలకే అక్కడ ఉన్న చిత్రం బృందం వారు పారిపోయారు . అక్కడి గ్రామస్థులు కొందరు కలిసి వారిని ఆసుపత్రికి తరలించారు అప్పటికే తల్లి బిడ్డలు ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు .
ఇది జరిగిన సమయంలో వేరే అమ్మాయికి కూడా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది . ఈ ఘటన జరిగిన అనంతరం చిరంజీవిసర్జ  అక్కడి నుండి బయలు దేరి వేరే షూటింగ్ కు వెళ్లి పోయారు . ఈ విషయం తెలుసుకున్న చేతన్  కుమార్ తనకు ఈ రోజు డేట్స్ లేవని , నాకు బ్లాస్టింగ్ సీన్ ఉందని మాత్రమే తెలుసునని . ఆ కుటుంబానికి నా సహాయాన్ని అంద  చేస్తానని చెప్పుకొచ్చారు . ఈ విషయం పై పోలీసులు ఆరాతీసి దర్యాప్తు చేస్తున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here