మెగాస్టార్ చిరంజీవికి చివరి రోజులు…. షాక్ లో చిరంజీవి కుటుంబం….మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు

0
174
టాలీవుడ్ చిత్రసీమని ఏలిన లెజెండరీ యాక్టర్లు ఎవరంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక ఎన్టీఆర్ తరువాత సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా అంతటిపేరు సంపాదించినప్పటికీ, ఎన్టీఆర్ ని తలదన్నే హిట్స్ కానీ చరిష్మా కానీ ఆయనకు కొంతవరకు దక్కలేదనే చెప్పాలి. అయితే ఆ తరువాత తరంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ తరువాత అంతటి లెజెండరీ హీరోగా ఘనత సాధించారు. ఇక చిరంజీవి సినిమాల్లో రారాజుగా ఎదిగి ఆ తరువాత ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీని నెలకొల్పారు. కానీ అప్పట్లో వుమ్మడి ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇక ఆతరువాత కొన్నాళ్ళకు చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్ తో కలిపేసి తాను కూడా కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక గత ఎన్నికల తరువాత కూడా చిరంజీవి కాంగ్రెస్ లోనే కొనసాగడంతో అయన ఎన్నాళ్ళు ఆ పార్టీలో వుంటారు అంటూ పలువురు అభిమానులు ఆయనకు పరోక్షంగా ప్రశ్నలు సంధించారు. ఇక చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం నేటితో ముగియనుందనేది అందరికి తెలిసిందే.
అయితే కొద్దిరోజులుగా వస్తున్న వార్తలను బట్టి చూస్తే, తన సభ్యత్వం ముగుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కనీసం నోరు కూడా మెదపని చిరంజీవి, త్వరలో తన తమ్ముడు నెలకొల్పిన జనసేన పార్టీలో చేరుతున్నారు అనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇక నేటితో అయన సభ్యత్వం ముగిస్తే, ఇకపై కాంగ్రెస్ లోనే కొనసాగుతారా లేక అందరు అంటున్నట్లు తమ్ముడు పార్టీలో చేరతారా, లేక మరేదైనా పెద్ద పార్టీ తీర్ధం పుచ్చుకుంటారా అనేది మాత్రం ఇంకా  తేలాల్సి వుంది. అయితే అయన సభ్యత్వం ముగుస్తుండడంతో ఇప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలు ఆయన్ని కలిసి, మా పార్టీలోనే వుండండి, భవిష్యత్తులో మీకు మరింత ప్రాధాన్యత కల్పిస్తాం అని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక మరోవైపు పవన్ సహా కొందరు జనసేన పార్టీ నాయకులు కూడా ఆయనతో రహస్యంగా ఇటీవల సమావేశం జరిపారని, అయితే అది గోప్యంగా జరిగిందని, ఇక రాబోయే రెండు మూడు రోజుల్లో చిరంజీవి కాంగ్రెస్ లోనే వుంటారా లేక మరేదైనా పార్టీలో చేరుతారా అనే దానిపై చాలావరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here