వైసిపిలోకి కమెడియన్ ఆలీ…..చేరికకు ముహూర్తం ఫిక్స్!

0
87
కొద్దిరోజుల క్రితం ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, మరియు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే మొదటినుండి తనకు పవన్ దేవుడు అని చెప్పే బండ్ల, మరి మీరు జనసేనలో ఎందుకు చేరలేదు అనే ప్రశ్నకు బదులుగా నాకు పవన్ దేవుడు, కానీ నేను చిన్నప్పటినుండి కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానిని అని చెప్పడం విశేషం. ఇకపోతే ప్రస్తుతం పవన్ తో మంచి సాన్నిహిత్యం వున్న పాపులర్ కమెడియన్ ఆలీ, త్వరలో వైసిపిలో చేరబోతున్నారు. మొదట్లో పవన్ పార్టీని నెలకొల్పినపుడు ఆలీ కూడా ఆ పార్టీలో చేరతారని అందరూ అనుకున్నారు. కానీ ఆలీ ఆ విషయమై ఇప్పటివరకు నోరు మాత్రం విప్పలేదు.
Image result for ali with jagan mohan reddy
ఇక వైసిపిలో ఆలీ చేరిక విషయమై అధికారిక ప్రకటన ఏది రానప్పటికీ, అనధికారికంగా మాత్రం ముహూర్తం కుదిరిందని వైసిపి వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇకపోతే గత నెల 28న వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డిని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేకంగా కలిసిన ఆలీ, తన రాజకీయ జీవితం గురించి కాసేపు చర్చించారని, తరువాత చివరకు ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయించారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న జగన్, తన యాత్రను ఈ నెల 9న పూర్తి చేయనున్న సందర్భంగా ఆ రోజునే ఆలి, వైసిపిలో చేరనున్నారట. కాగా ప్రస్తుతం ఈ వార్త అటు టాలీవుడ్, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here