తాను చేరబోయేది ఏ పార్టీలోనో తేల్చేసిన కమెడియన్ ఆలీ!

0
86
ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ ఆలీ కొద్దిరోజుల క్రితం వైసిపి అధినేత జగన్ గారిని కలవడంతో అయన ఆ పార్టీలోకి చేరుతున్నారని, అంతేకాక అందుకు జనవరి 9ని ముహూర్తంగా నిర్ణయించడం జరిగిందని పలు మీడియా వర్గాల్లో వార్తలు షికారు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయమై ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి నిన్న ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చిన ఆలీ, తాను జగన్ గారికి ఒక ఫ్లైట్ లో మాములుగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది…
Image result for comedian ali
దాన్నిపట్టుకుని ఎవరికీ నచ్చినట్లు వారు వార్తలు రాసుకున్నారని, అవన్నీ అసత్యాలని చెప్పుకొచ్చారు. అయితే తనకు ఏ పార్టీలో చేరుతున్నాఉ అని అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ఆలీ, నేను నిజానికి కొన్ని నియమాలు పెట్టుకున్నాను, వాటిని ఒప్పుకున్నా పార్టీలో చేరుతాను,,, అది టిడిపి కావచ్చు, వైసిపి లేదా జనసేన కావచ్చు అంటూ చెప్పుకొచ్చారు. ఇక తన స్నేహితుడైన పవన్ ను రెండురోజుల క్రితం కలిసిన ఆలీ, అది కేవలం సరదాగా జరిగిన కలయిక అని తేల్చేశారు. కాగా రాబోయే రోజుల్లో ఆయన ఏ పార్టీలో చేరుతారు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ మొదలయింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here