ప్రభాస్ ఫామ్ హౌస్ సీజ్ చేయడంపై తాజా హై కోర్ట్ నిర్ణయం ఏంటంటే?

0
95
బాహుబలి సినిమా విజయంతో తన పేరుని జాతీయ స్థాయికి చేర్చుకున్న నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఆ సినిమా తో ప్రభాస్ నేషనల్ ఇమేజి సాధించడంతో, ఇకపై అయన సినిమాలన్నీ పలు జాతీయ భాషల్లో కూడా విడుదల కానున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సాహూ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతంలోని ప్రభాస్ ఫాంహౌస్‌ ని జిహెచ్ఎంసి అధికారులు సీజ్ చేసిన విషయం తీవ్ర కలకలం రేపింది. ఇక ఈ విషయమై ప్రభాస్ తన లాయర్ ద్వారా హై కోర్ట్ లో ఒక ఫిర్యాదును దాఖలు చేయడం జరిగింది. ఇక కొద్దిరోజలుగా దీనిపై వాదనలు జరుగుతుండగా, నేడు ఈ కేసు విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈ కేసులో పూర్తి వివరాలను అందివ్వాలని అధికారులను ఆదేశించింది.
Image result for prabhas farm house
రెగ్యులేషన్ కోసం ప్రభాస్ పంపిన అభ్యర్థనను ఎందుకు వెనక్కి పంపారని అధికారులను ప్రశ్నించింది. దీంతో పూర్తి వివరాలను గురువారం కోర్టు ముందు ఉంచుతామని లాయర్ పేర్కొన్నారు. రాయదుర్గంలోని పాన్ మక్తా గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమి ప్రభుత్వానిదేనంటూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో, శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వాసుచంద్ర ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో ప్రభాస్‌ ఫామ్ హౌస్ కూడా ఉండటంతో దాన్ని కూడా సీజ్‌ చేశారు. అయితే తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు సీజ్ చేయడంపై ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే..కాగా ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది…… .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here