కస్టమర్ ఫిర్యాదుతో ఎస్బిఐ కి ఫైన్ వేసిన కోర్ట్….. మ్యాటర్ ఏంటంటే?

0
71
ప్రస్తుతం వినియోగదారుల నుండి బ్యాంకులు జరిమానాలు పేరుతో విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమ సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వ లేనివారినుండి మూడు నెలలకు ఒకసారి వసూలు చేస్తున్న బ్యాంకులు, ఇకపై వాటిని మరింతగా పెంచేందకు యోచిస్తున్నాయి. అయితే ఆ విధంగా మన నుండి ఫైన్ వసూలు చేస్తున్న బ్యాంకులు, వారి విధులు కూడా సక్రమంగా నిర్వహించాలని చాల మంది వినియోగ దారులు అంటున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, రాయపూర్‌కు చెందిన ఒక బ్యాంక్ కస్టమర్ ఏటీఎంలో నగదు విత్‌ డ్రా కోసం వెళ్లినపుడు నో క్యాష్‌ అవైలబుల్‌ మెసేజ్‌ రా సాగింది. మూడుస్లారు ఇలాంటి చేదు అనుభవం అతనికి ఎదురు కావడంతో, చిర్రెత్తుకొచ్చిన సదరు కస్టమరు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. 2017 ఏడాదిలో మే, జూన్‌ నెలలో ఒకసారి, మరోసారి ఇలా మూడుసార్లు  ఏటీఏంలో నగదు తీసుకోలేకపోయాననీ, మేము సరిగ్గా బ్యాలెన్సు మెయింటెయిన్ చేయకపోతే ఫైన్లు వేసే బ్యాంకు ఈ విధంగా వ్యవహరించడం ఏమిటని, ఈ వ్యవహారంలో  తనకు న్యాయం చేయాల్సిందిగా కన్జ్యూమర్‌ ఫోరంలో ఫిర్యాదు చేశాడు.
SBI fined Rs 2,500 after its ATM failed to dispense cash - Sakshi
అయితే అతడి ఫిర్యాదును స్వీకరించి, విచారించిన కోర్టు అన్నిబ్యాంకులు ఏటీఏం సేవలపై ఏడాదికి ముందే ఫీజు నుకస్టమర్ల వద్దనుంచి వసూలు చేస్తున్నపుడు ఏటీఏంలో నగదు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఆయా బ్యాంకులకు ఉందని వినియోగదారుల ఫోరం తన తీర్పులో పేర్కొంది. అయితే అది కేవలం ఇంటర్‌నెట్‌ వైఫల్యమని, దీనికి సర్వీసు ప్రొవైడర్‌ బాధ్యత వహించాలన్న ఎస్‌బీఐ వాదనను కూడా తోసి పుచ్చింది కోర్ట్. అలాగే మినిమం బ్యాలెన్స్‌  మెయింటైన్‌ చేయని యూజర్ల నుంచి  ఏడాదిలో ముందే ఛార్జి వసూలు చేస్తున్నపుడు ఏటీఎంలలో నగదు లేకుండా ఏలా చేస్తారని ప్రశ్నించింది.  రూ.2500 ఖాతాదారుడికి ఫైన్‌ చెల్లించాలని ఆదేశించింది. కాగా ప్రస్తుతం ఇది వినియోగదారుడి విజయమని పలువురు నెటిజన్లు అతడిపై సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here