అవును నేను ‘గే’ ని అంటున్న క్రికెటర్!

0
33
సాధారణంగా ఏదైనా క్రీడలు జరుగుతున్న సమయంలో ప్రత్యర్ధులు ఓడిపోవాలని, మనమే గెలవాలని ఎవరికైనా ఉంటుంది. ఇక ఇంటర్నేషనల్ క్రీడలైన క్రికెట్, ఫుట్ బాల్ వంటి వాటిలో గెలుపు కోసం, అవతలి వారిని తమ పదునైన మాటలతో పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేసిన ఘటనలు అక్కడక్కడా చూసాము. ఇక అటువంటి చర్యలకు కొందరు క్రికెటర్లు కూడా పాల్పడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మూడో టెస్టులో భాగంగా జో రూట్, షానన్‌ గాబ్రియల్‌ మధ్య వాడివేడి మాటల యుద్ధం జరిగింది. మూడో రోజు ఆటలోఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌-జో డెన్లీలు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో విండీస్‌ పేసర్‌ గాబ్రియల్‌ దురుసుగా ప్రవర్తించాడు.
Image result for joe root
ఈ క్రమంలోనే జో రూట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే గాబ్రియల్‌ చేసిన వ్యాఖ్యలు మైక్‌లో స్పష్టత లేకపోయినప్పటికీ, జో రూట్‌ మాత్రం ‘గే’ అయితే తప్పేంటి అనే సమాధానం ఇవ్వడం మాత్రం రికార్డు అయ్యింది. దీనిపై పోస్ట్‌ మ్యాచ్‌ కాన్పరెన్స్‌లో రూట్‌ మాట్లాడుతూ, గాబ‍్రియల్ చేసిన వ్యాఖ్యలు తప్పని అనిపిస్తే, అతనే క్షమాపణలు కోరాలి. క్రికెట్ అట సమయంలో ఆన్‌ఫీల్డ్‌ లో మాటల యుద్ధం అనేది సహజం. కానీ వారు ఏదైతే వ్యాఖ్యానించారో దానికి కట్టుబడి ఉండాలి. అదే సమయంలో క్షమించమని కోరే తత్వం కూడా ఉండాలి అని అన్నాడు. ఇక రూట్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం మీడియా వర్గాల్లో వైరల్ అవుతున్నాయి…