పెళ్లి విషయం చెప్పలేదని భార్య,కూతురు పై దాడి

0
79

కూతురికి పెళ్లి ఖాయం అయిందని తనకు చెప్పలేదని కోపం భార్య, కూతురిపై కత్తితో దాడి చేశాడు ఓ రిక్షావాలా. ఈ దారుణమైన  సంఘటన ముంబై లోని బజారుపేటలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ముంబైలోని కళ్యాణ్ కు చెందిన మోహన్ మహాజన్ తన భార్యతో మనీషాతో కుటుంబ గొడవలవల్ల ఇద్దరు విడిగా ఉంటున్నారు. మనీషా కొడుకు, కూతురితో కలిసి థాకర్ పడాలో నీవశం ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం మనీషా కూతురు వివాహం నిశ్చయమైనది. ఇంకో కొద్ది రోజుల్లో తన కూతురు పెళ్లి జరగబోతున్నదని పరాయి వ్యక్తుల ద్వారా మోహన్ కు తెలిసింది. ఈ విషయం తెలియగానే మోహన్ కు కోపం పెరిగింది.

వెంటనే తన భర్య మనీషా ఇంటికి వెళ్లి తన కూతురి పెళ్లి విషయం తనకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించాడు. ఈ విషయం వల్ల భార్య,భర్తల మధ్య గొడవ మొదలైనది. దీంతో కోపం వచ్చిన మోహన్ కత్తితో చాల సార్లు దారుణంగా పొడిచాడు. అడ్డుగ వచ్చిన తన కూతురి గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. మనిషా మార్గం మధ్యలోనే మృతి చెందింది. తన కూతురి పరిస్థితి విషమంగా ఉన్నదీ. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here