బర్త్ డే బంప్స్ పేరుతో చితకబాదిన ఫ్రెండ్స్….. మృతి చెందిన విద్యార్థి

0
65

పుట్టిన రోజు సందర్భంగా ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ సెలబ్రేట్ చేసుకోవడం తెలిసిందే. బర్త్ డే బంప్స్ పేరిట పుట్టిన రోజు జరుపుకుంటున్న వ్యక్తిని సరదాగా మిత్రులు కొడుతూవుంటారు. ఆలా కొడితే దుష్ట శక్తులు దూరం అవుతాయని ఆలా కొడుతుంటారు. ఎంత గట్టిగ కొడితే అంత మంచిదని  నమ్ముతుంటారు. ఈ నమ్మకమో లేదంటే మనసులో కసి ఉంచుకొని కొట్టారేమో తెలియదు కానీ ఈ బర్త్ డే బంప్స్ వల్ల ఐఎంఎం స్టూడెంట్ మరణించాడు. పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే బంప్స్ పేరుతో విద్యార్థిని చితకబాదాడు. అయితే ఆ విద్యార్థికి మరుసటి రోజు కడుపు నొప్పి రావడంతో ప్రంక్సిస్ దెబ్బతినడంతో అతడు మరణించాడు. ఈ సంఘటన  రెండు నెలల క్రితం జరిగిందని తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. కానీ సోషల్ మీడియాలలో యువకుడిని చితకబాదుతున్న వీడియో వైరల్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here