సైరాలో ఒక్క సాంగ్ కోసం పెట్టిన ఖర్చు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
83
ఖైదీ నెంబర్ 150 సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఆ సినిమా అద్భుత విజయాన్ని అందుకోవడంతో తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. ఇకపోతే ఆ సినిమా విజయం తరువాత చిరంజీవి నెక్స్ట్ ఎటువంటి సినిమా చేస్తారా అని అందరు అనుకుంటున్నా సందర్భంలో మెగా స్టార్ ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత గాథ అయిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటించడానికి పచ్చ జెండా ఊపారు. రేసుగుర్రం దర్శకుడు సురేందర్ రెడ్డి దీనికి దర్శకుడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది.
Image result for sye raa narasimha reddy
అదేంటంటే, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా కోసం ఓ పాటను భారీగా చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో దాదాపు వెయ్యి మంది డాన్సర్లు, మరో వెయ్యి మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లు పాల్గొననున్నారన్న సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ పాట చిత్రీకరణ కోసం దాదాపుగా రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్‌ను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఆ సెట్‌లో పాట చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఈ పాటలో చిరుతో పాటు తమన్నా, నయనతార ఇతర నటీనటులు పాల్గొననున్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందన్న ప్రచారం జరుగుతోంది. కాగా ఈ సినిమాను స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here