బెగ్గర్ ఇంట్లో నోట్ల కట్టలు…..చూసి షాకైన పోలీసులు…..మ్యాటర్ కోసం ఇది చూడండి!

0
95
మనం ఇటీవల కొన్ని సంఘటనల్లో కొందరు రాజకీయ నాయకులు తాము సంపాదించిన డబ్బు కట్టలను గోడల్లో తాపడం చేయడం, అలానే అటకలు, పాత పెట్టెలు వంటి వాటిల్లో దాచిపెట్టడం అక్కడక్కడా చూసాము. నిజానికి ఇన్కమ్ టాక్స్ వారి నుండి తప్పించుకోవడానికి వారు ఈ విధంగా డబ్బులు జాగ్రత్తగా దాస్తుంటారు. అయితే రాజకీయనాయకులు అంతమొత్తంలో సంపాదించి దాచిపెట్టారంటే చాలావరకు నమ్మవచ్చు. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఒక ఘటనలో ఒక బిచ్చగత్తె, తన ఇంట్లో కొన్ని లక్షల రూపాయల డబ్బును దాచి ఉంచిన ఘటన హైదరాబాద్ నగర ప్రజల్లో కలకలం రేపింది. ఇక మ్యాటర్ లోకి వెళితే విజయలక్ష్మి అనే మహిళ గోషామహల్ ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. అయితే ఒకప్పుడు అక్కడి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసే విజయలక్ష్మి, ఇటీవల కొంత మానసికంగా దెబ్బతిని పనికి సరిగ్గా వెళ్లకపోవడంతో, అక్కడి అధికారులు ఆమెను వుద్యోగం నుండి తొలగించారు. ఇక అప్పటినుండి ఆమె ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో యాచక వృత్తి చేసుకుని జీవనం సాగిస్తోంది.
అయితే ఇటీవల కొన్ని నెలలుగా ఇంటికి చేరకుండా ఎక్కడికో కనిపించకుండా వెళ్లిపోయింది. ఇక ఆమె తాను అద్దెకు తీసుకున్న ఇంటికి చేరి ఆరునెలలు అవ్వడం, ఈ ఆరు నెలలుగా ఇంటి అద్దె కట్టకపోవడంతో నిన్న ఆ ఇంటి తలుపును పగలకొట్టిన ఇంటి ఓనర్ ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. విషయం ఏమిటంటే, ఆమె ఇంట్లో కట్టలు కట్టలుగా డబ్బులు చిందరవందరగా పడవేసివున్నాయి. ఇక విషయాన్నీ పోలీసులకు తెలిపిన ఓనర్, వారి సాయంతో ఆ కట్టలను లెక్కించసాగారు. ఇక ఆ కట్టలను మొత్తం లెక్కించగా దాదాపుగా అవి రూ.2,00,000లకు పైగా ఉన్నాయని మీడియాకి తెలిపాడు. అయితే ఇదివరకు విజయలక్ష్మి ఆ చుట్టుప్రక్కలివారితో తనవద్ద రూ.8,00, 000 వరకు డబ్బు ఉన్నట్లు చెప్పిందని, ఇప్పుడు ఓనర్ చెప్పిన దాని ప్రకారం మిగతా రూ.6,00,000 ఆ ఇంటి ఓనర్ కాజేసి కేవలం రూ.2,00,000 మాత్రమే లెక్కలు చెప్తున్నాడని అంటున్నారు. కాగా ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here