ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న దీపికా పదుకొణె దోశ….మ్యాటర్ కోసం ఇది చూడండి!

0
59
కొన్నాళ్లుగా ప్రేమించి ఇటీవల పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట రణవీర్, దీపికాలు ప్రస్తుతం తమ హనీమూన్ కోసం అమెరికా దేశానికి వెళ్లారు. అక్కడ పలు ప్రదేశాలను చుడుతున్న దీప్, వీర్ లు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, రెస్టారెంట్‌లలోని పదార్థాలకు సినీ ప్రముఖుల పేర్లు పెట్టడం చూస్తూనే ఉంటాం. ఇప్పటికే ముంబయిలోని పలు హోటళ్లలో ఆహార పదార్థాలకు సంజయ్‌ దత్‌, షారుక్‌ ఖాన్‌, అమీర్ ఖాన్, సల్మాన్ వంటి తదితర అగ్ర నటుల పేర్లు పెట్టి మరీ అమ్ముతున్నారు. ఇలాంటి సర్‌ప్రైజే ఇప్పుడు బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకొణెకు ఎదురైంది. ప్రస్తుతం అమెరికాలో దీపిక తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి హనీమూన్‌ నిమిత్తం టెక్సాస్‌ రాష్ట్రానికి వెళ్లారట.
ఇక నిన్నటి న్యూఇయర్‌ సందర్భంగా స్థానిక రెస్టారెంట్‌కు వెళ్లడం జరిగిందని, అయితే అక్కడి మెనూలో దీపిక పదుకొణె పేరుతో ఉన్న దోశను చూసి ‘దీప్‌వీర్‌’ సర్‌ప్రైజ్‌ అయ్యారట. వెంటనే ఆ మెనూను ఫొటో తీసి రణ్‌వీర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆ ఫొటోపై ‘నాకు ఆ దోశ తినాలనుంది’ అని సరదాగా ఒక క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. ఈ ఫొటోను చూసి రోహిత్‌ అనే నెటిజన్‌ పుణెలోని ఓ రెస్టారెంట్‌లో దీపిక పేరుతో రోటీలను అమ్ముతున్నారని వెల్లడిస్తూ మెనూ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇందుకు దీపిక నవ్వుతున్న ఇమోజీలను పెట్టారు. కాగా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో దీపికా దోశ వైరల్ గా మారింది. ఇది నిజంగా దీపికకు దక్కిన అదృష్టం అంటూ పలువురు దీపికా అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here