ఢీ జూనియర్స్ వర్షిణి ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే షాక్ అవుతారు!

0
173
కొందరు బాలనటులు సినిమాల్లో నటించి ఆపై పెరిగి పెద్దయ్యాక సినిమాల్లోకి రావడం, మరికొందరైతే తమకు నచ్చిన వేరొక వృత్తిని ఎంచుకుని జీవనాన్ని కొనసాగించడం చేస్తుంటారు. అయితే  చిన్నప్పుడే మంచి పేరు సంపాదించి, పెద్దయ్యాక కూడా సినిమాల్లోనే రాణించి మంచి పేరు గడించిన వారు కూడా ఎందరో వున్నారు. ఇకపోతే మరికొందరు బాలనటులు బుల్లితెరపై కనిపించి, ఆపై కొందరు కనుమరుగైతే, మరికొందరు మాత్రం అదే ఫీల్డ్ లో కొనసాగుతున్నారు. అటువంటి వాళ్లలో కొన్నేళ్ల క్రితం ఈటివి ఛానల్ లో ప్రసారమై మంచి క్రేజ్ సంపాదించిన ఢీ జూనియర్స్ ప్రోగ్రాం లో తన మెస్మరైజింగ్ పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకుని, చివరికి ఫైనల్ కి చేరి విజేతగా నిలిచిన వర్షిణిని మన తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేరనే చెప్పాలి. వర్షిణి డాన్స్ అంతగా బాలేదని, త్వరలోనే  షో నుండి ఆ అమ్మాయి ఎలిమినేట్ అవుతుందని కొందరు ఆడియన్స్ ఆమెపై మొదట్లో కొన్ని విమర్శలు చేసారు.
అయితే మెల్లగా తన పెర్ఫార్మన్స్ ని మెరుగుపరుచుకుంటూ ఇంతింతై  వటుడింతై అన్నట్లుగా, వర్షిణి తన డాన్స్ లతో చివరికి ఫైనల్ చేరుకొని ఆఖరికి విన్నర్ గా నిలిచి అందరి మన్ననలు అందుకుంది. ఆ తరువాత కనుమరుగైన వర్షిణి ఏమి చేస్తోంది, ఎలా వుంది అని కొందరు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దొరకలేదు. ఇకపోతే ప్రస్తుతం ఆ అమ్మాయి మంచి కొరియోగ్రాఫర్ గా తమిళ సినీ పరిశ్రమలో కొనసాగుతోందని తమిళ సినీవర్గాల నుండి సమాచారం. ఇక ఇటీవల విడుదలైన కొన్ని విజయవంతమైన సినిమాలకు కూడా వర్షిణి పని చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె డాన్స్ విషయంలో ఇదివరకటికంటే మరింత రాటు తేలిందని, ఇక సెట్స్ లో ఆమె హీరో, హీరోయిన్లకు కంపోజ్ చేసే స్టెప్పులు చూస్తే అది మనకు అర్ధం అవుతుందని పలువురు తమిళ నటులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here