ఢీ జోడీలో డాన్సర్స్ తో పాట పాడిస్తున్న సుధీర్….షాక్ లో శేఖర్ మాస్టర్!

0
76
ప్రస్తుతం ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతూ అటు ప్రేక్షకుల అభిమానం మరియు ఇటు దుమ్ము రేపే రేటింగ్స్ తో అదరగొడుతున్న డాన్సింగ్ షో ఢీ జోడి. ఇక ఈ షోకి యాంకరింగ్ చేస్తున్న రష్మీ, సుధీర్, ప్రదీప్ లు షోపై రోజురోజుకు మరింత ఆసక్తి పెంచుతూ వెళ్తున్నారు అనే చెప్పాలి. ఇక ఎప్పటివలే ఈ వారం కూడా షో మంచి ఎనర్జీతో సాగనుందని ఇటీవల విడుదల చేసిన ప్రోమోని బట్టి చూస్తే తెలుస్తుంది. ఇక ప్రోమోలో ఆర్య సినిమాకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన నిక్సన్ మాస్టర్ ఈ వారం శేఖర్ మాస్టర్ బదులుగా జడ్జిగా వచ్చి ప్రేక్షకులను అలరించనున్నారు. ఇక ప్రోమోలో సుధీర్, ప్రదీప్ లకు రష్మీ ఒక చిన్న పరీక్ష పెడుతుంది. ప్రదీప్ దగ్గరినుండి ఒక ఐటెం తీసుకుని తనకు గిఫ్ట్ గా ఇవ్వాలని రష్మీ చెప్పడంతో సుధీర్ కొంత భయపడినట్లు నటిస్తాడు. ఇక ప్రదీప్ చిన్నపిల్లాడిలా నటించడం, అతడిని ఎలాగోలా ఒప్పించి ఏదో ఒకవస్తువు తీసుకోవాలని సుధీర్ చేసే ప్రయత్నాలు షోలో వారిని కడుపుబ్బా నవ్విస్తాయి.
ఇక ప్రోమోని బట్టి చూస్తే, ఈ వారం షోలో కంటెస్టెంట్లు తమ అదరగొట్టే డాన్సింగ్ మొమెంట్లతో జడ్జెస్ మతి పోగొట్టారనే చెప్పాలి. అయితే డాన్స్ చేసిన తరువాత అందులోని ఒక జంటతో సుధీర్ ఒక పాట పాడమని అడుగుతాడు. ఆ జంటలోని ఒక అమ్మాయి, గోపీచంద్, ప్రియమణి నటించిన గోలీమార్ సినిమాలోని మగాళ్లు వొట్టి మాయగాళ్లు అనే పాట పాడుతుంది. ఇక చివరలో లైన్ పాడేటప్పుడు వీడు కూడా ఇంతే అని ప్రదీప్ ని చూపించడంతో షో మొత్తం నవ్వులను పూయిస్తుంది. ఇక ప్రోమో చివరిలో ఒక జంట పెర్ఫార్మ్ చేసిన ‘తల్లి తల్లి ఓ చిట్టి తల్లి’ డాన్స్ పెర్ఫార్మన్స్ అదిరిపోయిందని నిక్సన్ మాస్టర్ మెచ్చుకోవడంతో ప్రోమో ముగుస్తుంది. ఇక మొత్తంగా చెప్పాలంటే ఈ వారం ప్రసారం కాబోయే ఢీ జోడి ప్రోగ్రాం మంచి జోష్ తో సాగనుందని మాత్రం అర్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here