మెగాస్టార్ మనవరాలి పేరు ఏంటంటే?

0
102
ఇటీవల రెండవ వివాహం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ, ఇటీవల ఒక పండంటిపాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పటినుండో మెగా అభిమానుల్లో ఆ పాపకు పేరు ఏమి పెడతారా అని ఒకటే చర్చ. అయితే వాటికి తెరదింపుతూ నేడు శ్రీజ ఒక ఫోటోని పోస్ట్ చేస్తూ పాప పేరును రివీల్ చేసారు. తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి “పాప పేరు నవిష్క” అంటూ పేరు ను వెల్లడించాడు. నవిష్క అనే పదానికి అర్థం ఫరెవర్ న్యూ అంటే ఎప్పుడూ కొత్తగా ఉండేది అని అర్ధమట.
ఇక ఈ ఫోటోలో శ్రీజ మరియు ఆమె భర్త కళ్యాణ్ దేవ్ ఇద్దరూ ఆనందంతో వున్న ఫోటోని పోస్ట్ చేసింది. ఇక ఊయలలో ఉన్న పాప మొహానికి కళ్యాణ్ దేవ్ తన చేతిని అడ్డంగా పెడితే, శ్రీజ మాత్రం పాప పాదాలను అలా పట్టుకుంది.  ఇక ఆ ఫోటో చూసిన మెగా ఫ్యాన్స్ పేరు భలేగా ఉందని మెచ్చుకుంటూ సోషల్ మీడియా వేదికల్లో శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here