సంక్రాంతి రోజు భోగి పళ్ళు ఎందుకు పోస్తారో తెలుసా?

0
21
దక్షిణాది వారు, మరీ ముఖ్యంగా మన తెలుగువారు ఎంతో శోభాయమానంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి పండుగా ఎంతో ముఖ్యమైనది అనే చెప్పాలి. నిజానికి ఈ పండుగను రైతులు కోతకోసి చేతికొచ్చిన తమ పంటను అమ్మి, వచ్చిన డబ్బుతో ఇంటిల్లిపాధి ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఇక మకర సంక్రాంతిని భోగి, సంక్రాంతి, కనుమగా మూడురోజులు జరుపుకుంటారు అనే విషయం అందరికి తెలిసిందే. ఇక భోగి పండుగతోనే సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయి. ఈకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. చలి నుంచి రక్షణ కోసం భోగి మంటలు వేసుకుంటారు. భోగి మంటల్లో పాత వస్తువులను వేసి కాల్చేస్తుంటారు. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరించి, సూర్యనమస్కారం చేస్తారు. అయితే నిజానికి ఆరోగ్యంగా ఉండటానికి, ఉన్నత స్థానాలు చేరుకోవడానికి ఈ అలవాటు తోడ్పడుతుంది.
Image result for bhogi festival bhogi pallu

ఇక భోగి రోజున వాకిలి నిండా అందరూ ముగ్గులు వేస్తారు. ఇక ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెడతారు. అంతేకాక ముఖ్యంగా పిల్లలకు ఈ రోజు రేగుపళ్లు పోస్తారు. వీటిని భోగిపళ్లు అంటారు. భోగిపళ్లు పోయడమంటే సూర్యుణ్ణి ఆరాధన చేయడమే. భోగిపళ్లు పోయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, దేవుడి ఆశీస్సులు పిల్లలకు లభించి వారికీ అన్నింటా మంచి జరుగుతుందని నమ్మకం. అంతేకాకుండా సూర్యభగవానుడి కరుణ పిల్లలపై ఉంటుందని భావిస్తారు. ఇక గుమ్మానికి మామిడి ఆకులు తెచ్చి కట్టడం, అంతేకాక కొని తెచ్చిన గాలిపటాలు ఎగరేయడం  చేస్తుంటారు. ఇక ఇది పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి దీన్ని ‘హార్వెస్ట్‌ ఫెస్టివల్‌’ అని కూడా అంటారు. ఇక ఈ పండుగ రోజుల్లో ఇంటిల్లిపాది లక్ష్మి దేవిని పూజించి, రకరకాల పిండివంటలతో పండుగను ఎంతో ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు……