మహర్షి మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..!

0
65
సూపర్ స్టార్ మహేష్  బాబు ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్ లో బిజీగా వున్నా విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా అయన కెరీర్ లో ఎంతో ముఖ్యమైన 25వ సినిమా కావడంతో, ఈ సినిమాతో ఎలాగైనా పెద్ద హిట్ కొట్టి తన అభిమానులకు కానుకగా ఇవ్వాలని భావిస్తున్నారు మహేష్. అందుకే అయన సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నట్లు యూనిట్ వర్గాలు చెపుతున్నాయి. ఇక ఈ సినిమాను తొలుత ఉగాది పండుగ కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేస్తాం అని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే వున్నట్లుండి, మూడు రోజుల క్రితం తిరుమల విచ్చేసిన దిల్ రాజు సినిమాని ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
Image result for mahesh babu maharshi
అయితే అప్పటినుండి ఆ డేట్ పై టాలీవుడ్ వర్గాల్లో విపరీతమైన చర్చ మొదలైంది. అయితే నేడు ఎఫ్2 సినిమా సక్సెస్ పై మీడియాతో మాట్లాడిన దిల్ రాజు, మహర్షి సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చారు. నిజనికి మహర్షి సినిమా అనుకున్న విధంగా ఏప్రిల్ 5న విడుదల అవ్వాల్సింది. అయితే తమకు అమెరికా షెడ్యూల్ సమయంలో వీసా సమస్యల వలన ఒక నెలకుపైగా లేట్ అవ్వడం జరిగిందని, అందువల్లనే సినిమాని ఏప్రిల్ 25కి మార్చడం జరిగిందని, ఆ డేట్ కి మూవీ థియేటర్స్ లో తప్పకుండ ఉంటుందని స్పష్టం చేసారు. ఇక ఈ వార్త విన్న మహేష్ బాబు ఫ్యాన్స్ విపరీతంగా సంబరాల్లో మునిగిపోయారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here