వైరల్ అవుతున్న దిల్ రాజు వ్యాఖ్యలు…. మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
83
ప్రస్తుత సంక్రాంతికి విడుదల అవుతున్న మూడు తెలుగు సినిమాలైనా ఎన్టీఆర్, ఎఫ్2, వినయ విధేయ రామ సినిమాలకు మాత్రం ఎక్కువ థియేటర్లు కేటాయించి, మేము కొనుగోలు చేసిన పేట సినిమాకు మాత్రం థియేటర్లు దక్కకుండా చేసారని ఆ సినిమాని తెలుగులో కొన్న అశోక్ కుమార్ అనే నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్, యువి క్రియేషన్స్ నిర్మాతలపై విమర్శలు గుప్పించారు. మొన్న జరిగిన పేట ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ, అయినా డబ్బింగ్ మరియు చిన్న సినిమాల పరిస్థితి మన రాష్ట్రాలలో మొదటినుండి ఇలానే వుందని,ఆ బడా నిర్మాతలు కేవలం బడా సినిమాలకు మాత్రమే థియేటర్లు కేటాయిస్తున్నారని అన్నారు. ఇక మరొక నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ,
Image result for dil raju
అటువంటి నిర్మాతలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు గట్టిగా చర్యలు తీసుకోవాలని అయన విజ్ఞప్తి చేసారు. ఇక ఈ విషయమై నిన్న స్పందించిన దిల్ రాజు, నిన్న కొందరు మాపై అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేసారు. అదే నిర్మాతలు ఇదివరకు సర్కార్, నవాబ్ వంటి సినిమాలు కొన్నపుడు మేము థియేటర్లు పూర్తిగా ఆరెంజి చేయడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూడు సినిమాలు ఆరు నెలలక్రితమే విడుదల తేదీలు ప్రకటించాయి. అశోక్ గారు ఇప్పటికిపు పేట మూవీ కొని దానికి థియేటర్లు కావాలి అనడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. అయినా మాపై ఈ విధంగా ఆరోపణలు చేసిన మా మంచితనంతోనే వాటిని పట్టించుకోవడం లేదని, దయచేసి ఇకనైనా నిజానిజాలు తెలుసుకుని మాట్లాడని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం దిల్ రాజు వ్యాఖ్యలు టాలీవుడ్ లో వైరల్ గా మారాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here