త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఓంకార్…..అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

0
125
ఆట షోతో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించిన యాంకర్ ఓంకార్. ఇక ఆ షో అప్పట్లో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ షో మంచి సక్సెస్ అవడంతో అక్కడినుండి ఓంకార్ కి మరిన్ని షోల్లో యాంకర్ గా అవకాశం వచ్చింది. ఇక అప్పటినుండి బుల్లితెరపై దూసుకెళ్లిన ఓంకార్, ఆపై మాయాద్వీపం, 50-50 షోలతో మరింత పేరు సంపాదించారు. ఇక ఆ తరువాత కొన్నాళ్ళకు రాజుగారి గది సినిమాతో టాలీవుడ్ రంగప్రవేశం చేసారు ఓంకార్. అయితే అనుకోకుండా ఆ సినిమాకు మంచి పేరు రావడంతో ఓంకార్ కు మరిన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే అనంతరం ఓంకార్ ఏకంగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో రాజుగారి గది సినిమాకు సీక్వెల్ తీసి అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఓంకార్ షోలు నిర్వహిస్తున్న సమయంలో పూరి జగన్నాథ్ వంటి అగ్ర దర్శకులు అప్పట్లో అయన షోకి ప్రత్యేక అతిథులుగా విచ్చేసి అలరించారు. ఇక ప్రస్తుతం అయన జీ తెలుగులో డ్రామా జునియర్స్ కి జడ్జిగా, అలానే స్టార్ మా లో సిక్స్త్ సెన్స్ అనే ప్రోగ్రాముకి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ప్రస్తుతం కొన్ని మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో ఓంకార్ పెళ్లి పీటలెక్కబోతున్నాడట.
నిజానికి కొన్నాళ్ల నుండి ఓంకార్ కి అయన తల్లితండ్రులు సంబంధాల కోసం వెతుకుతున్నారని, అయితే ఎట్టకేలకు ఒక అమ్మాయిని ఓంకార్ కి భార్యగా నిశ్చయించారట అయన తల్లితండ్రులు. ఆ అమ్మాయి మరెవరో కాదు, ప్రస్తుతం తెలుగు ఛానళ్లలోని సీరియల్స్ లో నటిస్తున్న ఒక ఫేమస్ అమ్మాయి అని అంటున్నారు. అయితే ఆమె పేరు మాత్రం వారే త్వరలో మీడియాకి ప్రకటన రూపంలో విడుదల చేస్తారట. ఇక ఓంకార్ కు పెళ్లి విషయమై ఇప్పటికే అయన ఇంట్లో సందడి మొదలైందని, మెల్లగా ఒకరొకరుగా బందువులు కూడా వారి ఇంటికి చేరుకొని ఇల్లంతా సందడిమయం చేస్తున్నారని వినికిడి. ఇక ఈ శుభవార్త ముందే కొన్ని మీడియా వర్గాల్లో లీక్ కావడంతో పలువురు బుల్లితెర మరియు వెండితెర ప్రముఖులు ఓంకార్ కు అభినందనలు తెల్పుతున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here