పార్టీకి వెళ్లేముందు క్షణాల్లో పూర్తయ్యే ఫేస్ ప్యాక్! 

0
75
మనం ఎపుడైనా పార్టీలకు లేదా ఏదైనా ఫంక్షన్ కు వెళ్లదలిస్తే మాత్రం కాస్త ఖంగారుగా అనిపించి, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని భావించి, బ్యూటీ పార్లర్ కు వెళ్లి వందలు, వేలు పోసి ఫేషియల్స్ వంటివి చేయించుకోవడం చేస్తుంటాం. అయితే అటువంటివి అవసరం లేకుండా, కేవలం ఇప్పుడు చెప్పుకునే ఈ పద్ధతి ద్వారా పార్టీల వంటివాటికి వెళ్లే ముందు పేస్ ప్యాక్ ఒకటి చేసుకుంటే మన మొహం కాంతివంతంగా మెరిసిపోతుంది. దానికి కావలసినవి కూడా కేవలం రెండంటే రెండే వస్తువులు. అవి ఒకటి ఫెయిర్ అండ్ లవ్లీ క్రీం, మరియు రెండవది నిమ్మచెక్క. ముందుగా మన చర్మాన్ని చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకున్న తరువాత ఒక బౌల్ లోకి ఒక స్పూన్ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీం మరియు రెండు స్పూన్ల నిమ్మ రసం తీసుకుని బాగా పేస్ట్ అయి, రెండు కలిసేంతవరకు కలుపుకోవాలి.
Related image
ఇక అవి రెండు పూర్తిగా కలిసాక, దానిని మన చర్మం పై కొద్దికొద్దిగా మెల్లగా అప్లై చేసుకుని పూర్తిగా చర్మంలో అది ఇంకిపోయేదాకా మర్దన చేసుకోవాలి. ఇక పూర్తిగా ఇంకిపోయాక, ఒక పొడి బట్ట తీసుకుని దానిపై మెల్లగా రుద్దాలి. ఇలా చేయడం వలన చర్మంపైన వున్న తెల్లటి పొరమొత్తం పోయి ఫెయిర్ అండ్ లవ్లీ మరియు నిమ్మకాయ కలిపిన క్రీం చర్మంలోకి పూర్తిగా ఇంకుతుందట. ఇలా కనుక మనం పార్టీకి వెళ్లే ముందు చేసుకుని వెళ్తే మన చర్మం ఎంతో కాంతివంతంగా మెరవడంతోపాటు ఎటువంటి మచ్చు లు కూడా దాదాపుగా కనపడకుండా పోతాయట. అయితే ఇది తరచు కనుక చేస్తే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here