రామ్ సరసన ‘ఐస్మార్ట్ శంకర్’ లో నటించే స్మార్ట్ హీరోయిన్స్ ఎవరంటే?

0
97
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా ఐస్మార్ట్ శంకర్. ఇక పూర్తిగా షూటింగ్ మొదలుకాకముందు నుండే ఈ సినిమా పై అంచనాలు విపరీతంగా వున్నాయి అనే చెప్పాలి. ఇక ఈ సినిమాని పూరితో కలిసి హీరోయిన్ ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Related image
ఇకపోతే ఇప్పటికే ఈ మూవీలో సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది, ఇక నేడు నన్ను దోచుకుందువటే సినిమా హీరోయిన్ నభ నటేష్ కూడా మరొక హీరోయిన్ గా నటిస్తోందని యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక రామ్ నటిస్తున్న సినిమాకు తొలిసారి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఫ్లాప్ లతో సతమతం అవుతున్న రామ్ మరియు పూరి, ఈ సినిమాతో అయినా మళ్ళి సక్సెస్ ట్రాక్ లోకి వస్తారో లేదో వేచి చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here