భార్య నమ్రత పుట్టినరోజున మహేష్ ట్వీట్ ద్వారా ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే?

0
25
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పొలాచ్చిలో శరవేగంగా జరుగుతోంది. అయితే నేడు తన భార్య నమ్రత శిరోద్కర్ సందర్భంగా మహేష్ బాబు కాసేపటి క్రితం తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, నువ్వు నాకు భార్యగా దొరకడం నిజంగా నా అదృష్టం,
Image result for namratha date of birth
అంతేకాదు నేను చేసే ప్రతిపనికి నువ్వు ఎంతో సపోర్ట్ చేస్తూ నాకు ఎంతో ప్రియమైన దానివి అయ్యావు అంటూ అయన ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు. కాగా మహర్షి సినిమా మొదట అనుకున్న విధంగా కాకుండా, ఏప్రిల్ 25కి వాయిదా పడింది అనే వార్తలకు నేడు ఫుల్ స్టాప్ పెడుతూ నిర్మాత దిల్ రాజు, మా మహర్షిని ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం అని చెప్పారు. రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడంతో మహేష్ బాబు ఆనందాలకు అవధులు  లేకుండా పోయాయి. ఇక ప్రస్తుతం మహేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతోంది …