ఎన్టీఆర్ బయోపిక్ లో వైఎస్సార్ రోల్ లో నటించిన వ్యక్తి ఎవరో తెలుసా?

0
90
నేడు ప్రేక్షకుల ముందుకువచ్చిన తెలుగు వారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారి జీవిత గాథ ఆధారంగా రూపొందిన సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు. ఇక ఈ సినిమాపై అన్నిచోట్ల నుండి మంచి పాజిటివ్ స్పందన వస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటించగా, బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్య బాలన్, చంద్రబాబుగా హీరో రానా, హరికృష్ణ గా కళ్యాణ్ రామ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే, సినిమాలో వైఎస్సార్ పాత్ర గురించి. ఇక ఈ సినిమాలో అయన పాత్రలో నటించింది, ప్రముఖ క్యారెక్టర్ ఆరిస్ట్ శ్రీ తేజ్,  గతంలో ఈయన వర్మ తీసిన వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రు పాత్రలో నటించి మెప్పించారు.
నిజానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి స్నేహితులు  అంతేకాక ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 1973లో ఎమర్జెన్సీ ఎత్తేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ ఐదవ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఎన్టీఆర్ అప్పటికి రాజకీయాల్లోకి ప్రవేశించలేదు. సినీ రంగంలో ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఉండడం, దీంతో వెంగళరావు ప్రమాణస్వీకారానికి ఎన్టీఆర్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించమని చంద్రబాబుకు కాంగ్రెస్ నేతలు చెప్పడం, వెంగళరావు తన స్నేహితుడు కావడంతో ఎన్టీఆర్ ఆ కార్యక్రమానికి విచ్చేయడం జరుగుతుంది. అలా వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని తన మిత్రుడిగా ఎన్టీఆర్‌కు చంద్రబాబునాయుడు పరిచయం చేస్తున్న సన్నివేశాన్ని సినిమాలో చూపించారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నివేశాన్ని చాలా తక్కువ నిడివితో చూపించినప్పటికీ రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో కూడా ఈ పాత్ర కొంత ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here