క్రేజ్, ఫాలోయింగ్, కలెక్షన్ల పరంగా ఏవిధంగా చూసినా టాలీవుడ్ కింగ్ ఎవరంటే?

0
208
ఒకప్పుడు విశ్వ విఖ్యాత సార్వభౌమ ఎన్టీఆర్ గారు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా కొన్నేళ్లపాటు తన హవాని కొనసాగించారు. ఆ తరువాత కొన్నేళ్లు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ స్థానానికి  చేరువైనప్పటికీ, ఆపై వచ్చిన మెగా స్టార్ చిరంజీవి మాత్రమే మళ్ళి టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా, నంబర్ వన్ స్థానములో నిలిచి మంచి పేరు సంపాదించారు. ఇక చిరు తరువాత వచ్చిన వారిలో నిజమైన నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయమై ఇప్పటికీ కొంత సందిగ్దత కొనసాగుతూనే వుంది. అయితే అప్పట్లో సినిమాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మాత్రమే సమానమైన క్రేజ్, కలెక్షన్ల రికార్డులతో ఇప్పటికీ దూసుకుపోతున్నారు అనే చెప్పాలి. ఎందుకంటే ఆపై వచ్చిన ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ వంటి వారు ఉన్నప్పటికీ కూడా వీరిద్దరికి వుండే ఫాలోయింగ్ కొంత ప్రత్యేకమని చెప్పాలి.
ఒక సమయంలో పవన్ హవా, మరొక సమయంలో మహేష్ హవా కొనసాగినప్పటికీ, ఇద్దరూ సమానంగానే నిలుస్తున్నారు. ఇక ఇటీవల ప్రభాస్ బాహుబలి, చరణ్ రంగస్థలం, ఎన్టీఆర్ అరవింద సమేత వంటి సూపర్ హిట్స్ కొట్టినప్పటికీ మహేష్, పవన్ కి వున్న చరిష్మా ముందు ఒకింత నిలవలేరు అనేది అందరు ఒప్పుకోవాల్సిన విషయం అని సినిమా విశ్లేషకులు అంటున్నారు. ఇక పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా, ఒకవేళ మహేష్ కి సరైన హిట్ రాకపోయినా వారి స్టామినా, క్రేజ్ అనేది మాత్రం మరింతగా పెరుగుతుందే తప్ప తగ్గదు. అయితే రాబోయే రోజుల్లో ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ వంటి వారు మరిన్ని విజయాలు అనుకుని వారిద్దరి స్థాయిని అందుకోగలరో లేదో చూద్దాం……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here