ఆపరేషన్ తరువాత ఆమె కడుపులోవి చూసి ఆశ్చర్యపోయిన డాక్టర్లు…. మ్యాటర్ ఏంటంటే ?

0
125
నిజానికి  ప్రస్తుతం సంక్రమిస్తున్న రకరకాల వ్యాధులకు మూలకారణం మనం తినే నాణ్యత మరియు శుభ్రత లేని ఆహారం. అంతేకాదు ఆకలితీరెలా చూసుకుంటున్నంతప్ప అది మంచిదో చెడ్డదో కూడా మనలో చాలామంది పట్టించుకోవడం లేదు. ఇకపోతే ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఒక యువతి, అనుకోకుండా కడుపు నొప్పితో బాధపతుడూ ఉండగా, ఆమె పరిస్థితిని గమనించిన ఇంట్లోని వారు, వెంటనే ఆమెను సమీప ఆసుపత్రిని తరలించారట. అయితే ఆమెకు చిన్నపాటి టెస్టులు చేసిన డాక్టర్లు, ఆమె కడుపులో ఏవో కదలాడుతున్నాయని, అవేంటో తమకు అర్ధం కావడం లేదని కొంత ఆందోళనలో పడ్డారట. నువ్వు ఏమి తిన్నావు, రోజు ఎటువంటి పదార్ధాలు తింటావు అని ఆ అమ్మాయిని ప్రశ్నించారట డాక్టర్లు.
Related image
దానికి ఆ అమ్మాయి, తనకు ఎక్కువగా ఇంట్లో తినే
సమయం వుండకపోవడం వలన, ఎక్కువగా బయటి ఆహారాన్నే తీసుకంటానని, అవి కూడా ఎక్కువగా నూడిల్స్, ఫ్రైడ్ రైస్ వంటివి మరింత ఎక్కువ తింటానని చెప్పిందట. ఇక ఆమెకు నొప్పి మరింత ఎక్కువ అవడంతో, చివరికి ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు, ఆమె కడుపులోనుండి పెద్ద పెద్ద వానపాములు సైజులో వుండే కొన్ని క్రిములను బయటకు తీసారట. అయితే వాటిని చూసిన డాక్టర్లాలు ఒక్కసారిగా ఆశ్చర్యం వేసిందని తెలుస్తోంది. నిజానికి బయట తిండి తింటూ, అది సరిపడక, కడుపులో  క్రిములు వుండడంవలన, అవి పెరిగి పెద్ద అయి పెరగడం వలన కడుపునొప్పితో ఎందరో పేషంట్ లు తమ వద్దకు వస్తారని, అలా వచ్చిన కొందరికి ఆపరేషన్ కూడా చేసేవారమని, అయినా ఇలా, ఇంతపెద్ద వానపాము సైజు క్రిములను మాత్రం ఎవ్వరి కడుపులోనూ ఇప్పటివరకు చూడలేదని చెప్పారట. కాగా, ఈ విషయాన్నీ ఆ అమ్మాయిని వివరించిన డాక్టర్లు, ఇకపై బయట పదార్ధాలు తినకుండా ఎక్కువగా ఇంట్లోనే తినమని సలహా ఇచ్చారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here