దుబాయ్ లో ప్రజలు ఎలా జీవిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
93
1970వ దశకంలో ఎంతో దుర్భరంగా వున్న దుబాయ్ దేశం ప్రస్తుతం ప్రపంచంలోని ధనిక దేశాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. నిజానికి దేశ విదేశాల నుండి అనేక మంది ప్రజలు ధనార్జన కోసం దుబాయ్  కి వెళ్తుంటారు. మన దేశంలో కూడా చాలామంది అక్కడకు వెళ్లి డబ్బు సంపాదిస్తున్న వారున్నారు. ఇకపోతే ఎక్కువగా అక్కడకు వెళ్ళేవారిలో డ్రైవర్ లు గా చేరేందుకు వెళ్తుంటారు. దానికి ప్రధాన కారణం, అక్కడ దాదాపుగా ప్రతి ఇంటికి ఒక కారు ఉండడమే. అయితే కార్లు ఉన్నప్పటికీ, అందులో ఎక్కువమందికి డ్రైవర్ల అవసరం ఉంటుంది. అందువల్ల అక్కడకు వెళ్లి డ్రైవర్లు గా చేరేవారిలో మన దేశస్థులే ఎక్కువ ఉంటారట. ఇకపోతే దుబాయిలో వుండే ప్రజల్లో దాదాపుగా 20శాతానికి పైగా అత్యంత ధనికులు ఉంటారట, వారిని ఎమిరేట్స్ అని పిలుస్తారట. అంతేకాక వారి జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని, ఇక్కడ మనం మాములుగా కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకున్నట్లు అక్కడ సింహాలు, పులుల పిల్లల్ని పెంచుకుంటుంటుంటారట. ఇక వాటి ఆహారం కోసం నిత్యం బోలెడు డబ్బు కూడా ఖర్చు పెడుతుంటారట. ఇకపోతే దుబాయ్ లో ఇక్కడిలా తిండికి పెద్దగా డబ్బు ఖర్చు పెట్టనవసరం లేదని, కొన్ని ప్రధాన కూడళ్లలో కప్ బోర్డులు, మరియు ర్యాకులు ఏర్పాటు చేసి వాటిలో ఫుడ్ పాకెట్స్ వుంచుతారట. వాటిని ఎవరైనా వచ్చి తినవచ్చట.
ఇకపోతే అక్కడి మహిళలపై పెద్దగా ఆంక్షలు పెట్టరట. మిగతా దేశాలతో పోలిస్తే అక్కడి ప్రభుత్వం, మహిళా రక్షణకు మరియు స్వేచ్చకు దుబాయ్ లో పూర్తిగా రక్షణ వుంటుందట. ఇక ముఖ్యంగా ఏ దేశంలో అయినా ఆ దేశ పౌరులు సంపాదించిన ఆదాయంలో కొంత శాతం పన్ను రూపేణ ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది, కానీ దుబాయ్ లో మాత్రం అటువంటిది ఏమి ఉండదట. ఒక్కరూపాయి కూడా మన సంపాదనలో ప్రభుత్వానికి చెల్లించవలసిన అవసరం ఉండదు. ఇక దుబాయ్ లో ఎక్కువగా బంగారానికి ప్రాధాన్యత ఇస్తారట అక్కడి ప్రజలు, అందుకే ధనవంతులు అక్కడ బంగారపు బైక్ లు, కార్లు, రకరకాల ఫర్నిచర్ వస్తువులు వంటివి తయారుచేయించుకుని వాడుతుంటారట. ఇకపోతే మన దేశంలో వలె అక్కడ కూడా బస్సులు వుంటాయని, ఇక బస్ కోసం వెయిట్ చేసేందుకు ఎసి ప్లాట్ ఫామ్స్ దుబాయ్ ప్రత్యేకత అని చెపుతున్నారు. ఇకపోతే ప్రపంచంలోని అతిపెద్ద కట్టడం బుర్జ్ ఖలీఫా దుబాయ్ లోనే కొలువై వుంది.
ఇక దుబాయ్ లో ఎక్కువగా అక్కడి ప్రజలు షాపింగ్ కి డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఆ నగర వ్యాప్తంగా మొత్తం 78 షాపింగ్ మాల్స్ ఉన్నాయని, అంతేకాక ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ దుబాయ్ లోనే వుంది, దానిలో దాదాపుగా 1250కి పైంగా షాపులు వున్నాయట. అందుకే ఆ దేశాన్ని షాపింగ్ కాపిటల్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్ అని కూడా అంటారు. సో చూసారుగా ఫ్రెండ్స్, దుబాయ్ నగరం మరియు అక్కడి ప్రజల జీవనం గురించి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here