ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం……భయాందోళనలో ప్రజలు!

0
60
ప్రస్తుత కాలంలో ప్రకృతి వైపరీత్యాలైన సునామి, భూకంపం, తుఫాను వంటి వాటిని శాస్త్రవేత్తలు ముందుగానే గుర్తించగలుగుతున్నా వాటివల్ల జరిగే నష్ట తీవ్రతను మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌ దక్షిణ ప్రాంతంలోని మిందానావో ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.2గా నమోదైందని అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. అయితే ఈ విషయమై భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న తీరాల్లో సునామీ వచ్చే ప్రమాదముందని పసిఫిక్‌ సునామీ కేంద్రం ఇప్పటికే హెచ్చరకాలు జారీ చేసింది.  భూకంపం నేపథ్యంలో అక్కడి అధికారులు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.హెచ్చరికల తీవ్రతను బట్టి ప్రజలు తీర ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు. ఫిలిప్పీన్స్‌తోపాటు ఇండోనేషియాలోని కొన్ని ద్వీపాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
Image result for earthquake in philippines
అయితే భూకంపం వల్ల కలిగిన నష్టం వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. మిండనావో ద్వీపం యొక్క అతిపెద్ద నగరమైన డావావో తీరాన, పాండగువన్‌ పట్టణానికి సుమారు 62 మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లుగా యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. కాగా దీనివల్ల ప్రాణ నష్టం పెద్దగా లేదని, అయితే కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళు మరియు రోడ్లు బీట్లిచ్చాయని అక్కడి ప్రజలు కొందరు వాటిని ఫోటోలు తీసి మరీ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ భూకంప భీభత్సానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.. కాగా ప్రజలు ఎవరు ఆందోళనకు గురికావద్దని, ప్రభుత్వం తమకు అండగా ఉండి అన్ని సహాయక చర్యలు తీసుకుంటుందని అధికారులు చెపుతున్నారు ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here