న్యూ ఇయర్ సందడిలో ఏకమైన ఢీ, జబర్దస్త్ టీముల….. చూస్తే షాక్ అవుతారు!

0
179
నూతన సంవత్సరం అంటేనే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే వేడుక అనేది తెలిసిందే. ఇక పాత సంవత్సరానికి వీడ్కోలు పలకి, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ నూతనోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటారు. ఇక అటువంటి ప్రత్యేకరోజున టివి ఛానల్స్ వారు కూడా సరికొత్త ప్రోగ్రాములు ప్రసారం చేసి తమ వీక్షకులకు మరింత ఆనందాన్ని జోష్ ని ఇవ్వాలని రకరకాల కొత్త ప్రోగ్రామ్స్ ని ప్రసారం చేస్తుంటారు. అయితే ఇక కొద్దిరోజుల్లో రాబోయే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈటివి ఛానల్ వారు ఎవడిగోలవాడిది పేరుతో ఒక సరికొత్త ప్రోగ్రాం ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇక కాసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదలైన ఈ షో తాలూకు ప్రోమో, వేలాది వ్యూస్ తో దుమ్ము దులుపుతోంది. ఇక ఈ టీజర్ ఆద్యంతం మంచి సందడి మరియు నవ్వులభరితంగా సాగింది. ఇక ప్రోమోని బట్టి చూస్తే, ఆ ఛానల్ లో ప్రసారమయ్యే ఢీజోడి, మరియు జబర్దస్త్ ప్రోగరములోని పార్టిసిపెంట్స్ మరియు జడ్జీలు ఈ షోలో పాల్గొని సందడి చేసారు.
ఇక ముఖ్యంగా సుడిగాలి సుధీర్, రాజమౌళి, గెటప్ శ్రీను, భానుశ్రీ, రోజా, నాగబాబులు షో మొత్తం ఉత్సాహంగా నడిపినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రదర్శితమైన ఇటువంటి ఒక ప్రత్యేక ప్రోగ్రాంలో ఢీజోడి, పటాస్ షోల పార్టిసిపెంట్స్ కు మధ్య కొంత వివాదం జరగడంతో ఇక త్వరలో ప్రసారం కాబోయే ఈ షోలో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారట షో నిర్వాహకులు. ఇక ప్రోమోని బట్టి చూస్తే, సుధీర్ రాకింగ్ స్టైల్ ఎంట్రీ, గెటప్ శ్రీను మరియు భానుశ్రీ ల జంట చేసిన టాప్ హీరోస్ పేరడీ సాంగ్స్ , రాజమౌళి మరియు సన్నీ ల కామెడీ స్కిట్స్, అలానే నాగబాబు మరియు రోజాల పంచెస్ తో షో మొత్తం అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ షో తాలూకు ప్రోమో సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here