గెటప్ శ్రీనుతో జతకట్టిన భాను శ్రీ…..ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే!

0
12
ఎప్పటికపుడు పండుగలు, ప్రత్యేక రోజుల్లో బుల్లితెర ఛానల్స్ తమ వీక్షకులకు వినోదాన్ని మరింతగా అందించాలనే ఉద్దేశ్యంతో రకరకాల కాన్సెప్ట్ లతో కొత్త ప్రోగ్రాములను రూపొందిస్తూ మంచి రేటింగ్స్ సాధిస్తూ వేటికవే దూసుకుపోతున్నాయి. ఇక ప్రముఖ తెలుగు ఛానల్స్ లో ఒకటైన ఈటివి ఇటీవల దసరా మరియు దీపావళి పండుగలను పురస్కరించుకుని సరైనోళ్లు, తరాజువ్వలు వంటి వెరైటీ ప్రోగ్రామ్స్ ప్రసారం చేసి మంచి రేటింగ్స్ సంపాదించిన విషయం తెలిసిందే. ఇక రాబోయే నూతన సంవత్సరం సందర్భంగా ఆ ఛానల్ వారు ఎవడిగోల వాడిది పేరుతో మరొక సరికొత్త ప్రోగ్రామ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే దీనికి సంబందించిన ప్రోమోని నేడు యూట్యూబ్ లో విడుదల చేసిన ఆ ఛానల్ వారు, టీజర్ కి మంచి స్పందన వస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రోమోని బట్టి చూస్తే సుధీర్, గెటప్ శ్రీను, రాజమౌళి చేసిన సందడి అంతాఇంతా కాదనే చెప్పాలి. ఇక ఇటీవల బిగ్ బాస్ షో ద్వారా పాపులరైన భానుశ్రీ, కొన్నాళ్ళపాటు ఢీ జోడికి యాంకర్ గా వ్యవహరించి మంచి పేరు సంపాదించింది.
ఇక మళ్ళి ఆ షో తరువాత చాలారోజులకు ఈ ఎవడిగోలవాడిది షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరించినట్లు తెలుస్తోంది. ఇక ప్రోమోలో గెటప్ శ్రీనుతో కలిసి భానుశ్రీ, ఎన్టీఆర్, ఎఎన్నార్, చిరంజీవి సినిమాల్లోని ఆకు చాటు పిందే తడిచే, అలానే నా కళ్ళు చెపుతున్నాయి, ఇక మెగాస్టార్ నటించిన అబ్బనీ తియ్యనీ దెబ్బ పాటల పేరడీల్లో నటించి షోలో వారందరిని అలరించినట్లు అర్ధం అవుతోంది. అయితే ఈ షో ద్వారా తనకు మళ్ళి మంచి పేరు వస్తుందని, ఇక గెటప్ శ్రీనుకు కూడా మంచి క్రేజ్ ఉండడంతో, అతనితో జతకట్టడంతో  న్యూ ఇయర్ రోజు ప్రసారమయ్యే ఈ షో తప్పనిసరిగా సక్సెస్ అవుతుందని భానుశ్రీ ఆశాభావం వ్యక్తం చేస్తోందట. ఇక ఇప్పటికే వేలాది వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ ప్రోమో నిజంగా సూపర్బ్ గా ఉందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు.