మాజీ ఎమ్మెల్యే గాడ్ ఫ్రే మృతి

0
26

మాజీ నిమినేటెడ్ ఎమ్మెల్యే దెల్ల గాడ్ ఫ్రే మృతి చెందారు. గుండె పోటుతో ఆమె అపోలో హాస్పిటల్ లో చేరారు. ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందారు. గాడ్ ఫ్రే మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు సంతాపం తెలిపారు. నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. గాడ్ ఫ్రే కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రగాఢ సానుభూతిని తెలిపారు . గాడ్  ఫ్రే గారు ఆంధ్రప్రదేశ్ శాసన సభకు రెండు సార్లు నిమినేటెడ్ ఎమ్మెల్యేగా నియమితులయ్యారు. ఆమె  2004 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి డిగ్రీ  పట్టా పొందారు. రేపు ఆమె అంత్యక్రియలు జరుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here