ఎఫ్2 మూవీ రివ్యూ : వెంకీ, వరుణ్ లకు మరొక విజయం దక్కిందా? 

0
123
పటాస్, సుప్రీమ్, రాజా ది  గ్రేట్ సినిమాలతో అద్భుత విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, తెరకెక్కించిన కొత్త సినిమా ఎఫ్2..విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ఇందులో హీరోలుగా నటించగా, తమన్నా మరియు మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని ఏరియాల నుండి మంచి టాక్ సంపాదీస్తోంది. ఇక సినిమా ఆద్యంతం మంచి వినోదంతో సాగుతుందని, అంతేకాక ప్రేక్షకుడికి మంచి రిలీఫ్ ని ఇచ్చే సినిమా అని చూసిన వారు చెపుతున్న మాట. ఓకే ఫ్యామిలీకి చెందిన అక్కాచెల్లెళ్లను పెళ్లిళ్లు చేసుకున్న ఇద్దరు వ్యక్తులు, పెళ్లి తరువాత ఆ అక్కచెల్లెళ్ళిద్దరి వల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేది సినిమాలో ప్రధాన కథాంశం అని చెపుతున్నారు. ఇకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని, ఇక హీరోలు మరియు హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని అంటున్నారు.
Image result for f2 movie review
ఇకపోతే ఫస్ట్ లో వచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయని, ఇక సెకండ్ హాఫ్ కూడా బాగానే నడిచిందని అంటున్నారు. ఇకపోతే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అయితే ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తాయని, ఇక కామెడీ డైలాగులు మరియు నటనతో ఆడియన్స్ ని అలరించే వెంకటేష్ కు ఈ సినిమా తప్పకుండ మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పవచ్చని అంటున్నారు. ఇక వరుణ్, తమన్నా, మెహ్రీన్ కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని, ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఆ పాత్రల తీరు తెన్నులు, మరియు వారితో చెప్పించిన కామెడీ డైలాగ్స్, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో సినిమాని దర్శకుడు అనిల్ రావిపూడి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడని అంటున్నారు. అంతేకాక దేవి శ్రీ మ్యూజిక్, దిల్ రాజు సంస్థ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంతమేర విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం ఇంకొన్నాళ్ళు వేచిచూడవలసిందే….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here