యూట్యూబ్ లో దూసుకెళ్తున్న ఎఫ్ 2 ట్రైలర్”!

0
94
విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో  రూపొందుతున్న కొత్త సినిమా ఎఫ్2…ఇక ప్రారంభం నుండి మంచి అంచనాలు పెంచిన ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ఇటీవల వైజాగ్ లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ని నిన్న యూట్యూబ్ లో విడుదల చేసింది సినిమా యూనిట్. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా వెంకటేష్, మరియు వరుణ్ కెరీర్ లో మంచి ఎంటర్టైనర్ గా మిగిలే అవకాశం ఉన్నట్లు కనపడుతోంది.
Related image
మరొక్కసారి వెంకటేష్ చాలా రోజుల తరువాత మంచి ఫన్నీ డైలాగులతో ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు మూడు డిఫెరెంట్ జానర్ల సినిమాలతో ఆకట్టుకున్న అనిల్, ఈ సినిమాలో భార్యబాధిత భర్తల అంశంపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వెంకీ, తమన్నా అలానే వరుణ్, మెహ్రీన్ ల జంటలు ట్రైలర్ లో బాగున్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది అనే చెప్పాలి. మరి ఈ సంక్రాంతి కానుకగా జనవరి12న విడుదల కానున్న ఈ సినిమా ఎంతటి విజయాన్ని ఆడుకుని రికార్డులు దక్కించుకుంటుందో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here