ప్రముఖ బాలీవుడ్ నటుడి తల్లి కన్నుమూత!

0
65
బాలీవుడ్ లో తన నటనతో అక్కడి ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్న నటుడు నానా పాటేకర్, ఇక ఇటీవల అయన రజినీకాంత్ తో కలిసి నటించిన కాలా సినిమా ఆయనకు మంచి పేరును తీసుకువచ్చింది. అయితే కొన్నాళ్లుగా అస్వస్థతతో బాధపడుతున్న అయన తల్లి నిర్మల పాటేకర్, నేడు మృతి చెందారు. కాగా ఆమె ప్రస్తుత వయసు 99 ఏళ్ళు. అయితే నానా తండ్రి ఆయనకు 28 ఏళ్ళ వయసులోనే చనిపోవడంతో, అప్పటినుండి తల్లి ఆయన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారని, అంతేకాక మా అమ్మే నాకు సర్వస్వము అని నానా పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం తెలిసిందే.
Nana Patekar  mother Nirmala passes away
ఇకపోతే తనయుడు నానాతో కలిసి గత కొన్నేళ్లుగా ముంబైలోనే నివాసం ఉంటున్న నిర్మల గారు, ఇటీవల కొంత మెదడు సంబంధ వ్యాధికి గురయ్యారట. ఇక అక్కడినుండి తల్లిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారట నానా. ఇక నిన్న హఠాత్తుగా ఆమె మరణించడంతో నానా ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. అయితే ఆమె మరణ సమయంలో అయన ఇంట్లో లేరట. విషయం తెలుసుకున్న నానా, తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి చేరుకొని ఆమె అంత్యక్రియలు పూర్తి చేసారు. కాగా నానా తల్లి మృతిపై పలువురు బాలీవుడ్ నటులు ఆయనకు సంతాపాన్ని తెలియచేస్తున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here