ప్రముఖ సింగర్ దారుణ హత్య

0
53

ప్రముఖ రాప్  సింగర్ దారుణ హత్య. ఈ  హత్య తో సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది . ఇక విషయానికొస్తే లాస్స్ ఏంజిల్స్ లోని ఒక దుస్తుల దుకాణం వద్ద ఆదివారం అర్దరాత్రి 2:30 గంటల సమయం లో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు రాప్ సింగర్ నిఫ్సే హాజిల్  పై కాల్పులు జరిపి దారుణంగా  హత్య చేశారు .  ఈ దుండగుల కాల్పుల్లో అక్కడే ఉన్న ఇంకో ఇద్దరికీ కూడా తీవ్ర  గాయాలయ్యాయి .

వారిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఒకరు దారిలో నే మృతిచెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు . అసలు సింగర్ ని కాల్చడానికి  గల కారణాలు తెలియాల్సి ఉంది . రాప్ సింగర్ నిఫ్స్ హాజిల్ ట్విట్టర్ చూసి నట్లైతే చివరి మెసేజ్ ఇలా ఉంది ” బలమైన శత్రువులు ఉండటం అనేది దీవెన ” అంటూ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే  ఈ దారుణం జరిగిపోయింది .

హత్య చేసింది ఎవరా అనే విషయం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . ఈ హత్య హాజిల్ తో గతంలో గొడవ పడ్డ వారేనని అతని స్నేహితులు తెలిపారు . హత్య చేసిన దుండగులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు . ఏది ఏమైనా సరే సంగీత ప్రపంచంలో ఇదొక తీవ్ర విషాదం అనే చెప్పుకోవచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here