పైలట్ సిగరెట్ కాల్చడం వలన 51మంది మృతి…. మ్యాటర్ ఏంటంటే?

0
69
ఇటీవల కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు ఒకింత పెరుగుతున్నాయి అనేది లేటెస్ట్ నివేదికల ఆధారంగా వస్తున్న సమాచారం. అయితే ఇటీవల విమానం నడుపుతున్న పైలట్‌ సిగరెట్‌ కాల్చడం వల్ల ఆ విమానం ప్రమాదానికి గురై 51 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన గత ఏడాది నేపాల్‌లో చోటుచేసుకోగా, అప్పటినుండి జరిగిన దర్యాప్తు అనంతరం ప్రమాదానికి గల కారణాలు తాజాగా వెల్లడయ్యాయి. కాక్‌పిట్‌లో పొగ తాగడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు విచారణలో తేల్చారు. యూఎస్‌, బంగ్లా విమానయాన సంస్థకు చెందిన బంబార్డియర్‌ యూబీజీ-211 విమానాన్ని గత ఏడాది మార్చి 12న నేపాల్‌లోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగి విమానంలో మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది సహా 51 మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 67మంది ఉన్నారు.  ఘటన జరిగిన సమయంలో ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీంతో అధికారులు దర్యాప్తు కోసం ప్యానెల్‌ ఏర్పాటు చేశారు. విచారణ చేపట్టిన ప్యానెల్‌ కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ పరిశీలించింది. విమానం నడుపుతున్న సమయంలో పైలట్‌ నిబంధనలకు విరుద్ధంగా కాక్‌పిట్‌లోనే పొగ తాగినట్లు గుర్తించారు. కాక్‌పిట్‌లోని సిబ్బంది నిర్లక్ష్యం, ల్యాండింగ్‌ సమయంలో పరిస్థితిపై అవగాహన కోల్పోవడం కారణంగా విమానం క్రాష్‌ ల్యాండ్‌ అయినట్లు తెలిపింది. పైలట్‌ సిగరెట్‌ తాగడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు. అయితే దీన్నిబట్టి నూటికి రూరుశాతం అది పైలట్ తప్పిదమే అని తెలిసిందని, ఇకపై విమానం నడిపే పైలట్లు ఎవరైనా సరే ఇటువంటి తప్పిదం చేయకుండా, దీనిని ఒక గుణపాఠంగా తీసుకోవాలని వాయుశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here