మొబైల్ ఫోన్ కొంటున్నారా….. ఫ్లిప్ కార్ట్ , అమెజాన్ లో ఆఫర్లే ఆఫర్లు!

0
67
ప్రస్తుతం భారత మార్కెట్ లో ఈ కామర్స్ సంస్థలు మంచి వాటినే నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గృహపకారణాలు, బట్టలు, ఇతర వస్తువుల వంటివి ఎక్కువమంది ఆన్ లైన్ ద్వారానే కొనడానికి ఇష్టపడుతున్నారు. ఇకపోతే ఈ సంక్రాంతి సీజన్ సందర్భంగా ప్రముఖ ఈ- కామర్స్‌ సంస్థలయిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులకు భారీ డిస్కౌంట్‌తో కూడిన డీల్స్‌ను తాజాగా ప్రకటించాయి. వినియోగదారులకు ఈ డీల్స్‌ ఈ నెల 20వ తేదీ నుంచి అందుబాటులోకి రానుండగా అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులకు, ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యులకు ఈ నెల 19 నుంచే ఈ ఆఫర్లు లభిస్తాయి. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ పేరుతో ఈ నెల 20 నుంచి 23 వరకు ఆఫర్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ పేరుతో ఈనెల 20 నుంచి 22 వరకు డీల్స్‌ ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా అమెజాన్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు వాడి కొనుగోళ్లు జరిపే వారికి 10శాతం తక్షణ డిస్కౌంట్‌ లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి షాపింగ్‌ చేసేవారికి 10శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు ప్రకటించారు.   అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో వన్‌ ప్లస్‌ 6టి, రెడ్‌మి వై2, హువాయ్‌ నోవె 3ఐ, హానర్‌ 8ఎక్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ మోడళ్లపై భారీ డిస్కౌంట్‌లు ఉన్నాయి. అమెజాన్‌ ఎకో ఉత్పత్తులు రూ.1,500 డిస్కౌంట్‌తో, అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌ 25శాతం డిస్కౌంట్‌తో లభిస్తాయి. కొన్ని ల్యాప్‌టాప్‌లు రూ.35,000 తగ్గింపుతో లభిస్తాయి. 450 రకాల హెడ్‌ ఫోన్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపు, హార్డ్‌ డ్రైవ్స్‌పై 60శాతం తగ్గింపు, నికాన్‌, క్యానన్‌, సోనీ కెమెరాలపై కనీసం రూ.5,000 తగ్గింపు ప్రకటించారు. ఇక ఈ ఆఫర్ల ప్రకటనతో ఎక్కువమంది వీటిని సద్వినియోగం చేసుకుంటారని, తద్వారా భారీ లాభాలు ఆర్జించవచ్చని ఆ సంస్థలు భావిస్తున్నాయి. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా మొబైల్ వంటివి కొనాలంటే మీకు ఇవి మంచి చాయిస్ గా నిలుస్తాయి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here