బ్రేకింగ్ న్యూస్ : ఇకపై మహిళలకు కూడా శబరిమల అయ్యప్ప దర్శనం! 

0
56
గత కొన్ని దశాబ్దాలుగా శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలోకి మహిళల, అంటే కేవలం చిన్న పిల్లల, అలానే వృద్ధుల ప్రవేశం మాత్రమే వున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ వాదనలపై ఇటీవల ఒక కమిటీ వేసి, ఇకపై ఆ దేవాలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించవచ్చనే తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే ఆలయంలోకి మహిళలను అనుమతించాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇది టీడీబీ గతంలో అనుసరించిన తీరుకు పూర్తి విరుద్ధం. ఈ దేవాలయాన్ని నిర్వహిస్తున్న బోర్డు ఇదేనన్న విషయం తెలిసిందే. అయితే గతంలో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభమైంది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముందు నాయర్ సర్వీస్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది కే పరాశరన్ వాదనలు వినిపించారు. ఈ తీర్పును రద్దు చేయాలని కోరారు.
Image result for sabarimala
ఇక ప్రస్తుతంట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. అన్ని వయసుల మహిళలను దేవస్థానంలోకి అనుమతించాలని సుప్రీంకోర్టుకు తెలిపింది. రాజ్యాంగ ధర్మాసనంలోని జస్టిస్ ఇందు మల్హోత్రా బోర్డు తరపు న్యాయవాదిని ఉద్దేశించి మాట్లాడుతూ రిట్ పిటిషన్లపై తీర్పు సందర్భంగా చేసిన వాదనలో మార్పు వచ్చిందా? అని అడిగారు. దీనిపై బోర్డు తరపు న్యాయవాది సమాధానం చెప్తూ ‘‘ఔను, తీర్పును గౌరవించాలని బోర్డు నిర్ణయించింది, దీనికి సంబంధించి దరఖాస్తు కూడా చేసింది’’ అని చెప్పారు. అయితే ఈ విషయమై పూర్తి అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడనుందని, ఇదే కనుక జరిగితే ఇకపై మహిళలందరికీ కూడా ఆ శబరిగిరీశుడి దర్శనం ప్రాప్తిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here