మహాకూటమి తరపున సీఎం అభ్యర్థిని ప్రకటించిన రాహుల్ …. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

0
138
ఇక తెలంగాణ ఎన్నికలకు సమయం మరింత దగ్గరపడడంతో ప్రధాన పార్టీలు ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కూడా మహాకూటమి తరపున ఒక మీటింగ్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసి పార్టీ శ్రేణుల్లో మంచి జోష్ నింపింది. అయితే ఆ సమయంలో తమ కూటమి తరపున సీఎం అభ్యర్థులను రాహుల్ అందరితో కలిసి చర్చించి ప్రకటించినట్లు కొంత సమాచారం అందుతోంది. నిజానికి ఈ కూటమి తరపున 80కి పైగా స్థానాల్లో పోటీ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఒకవేళ కూటమి విజయం సాధించిన పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ వంటి కొందరు ప్రముఖుల పేర్లు సీఎం అభ్యర్థిగా గట్టిగా వినిపిస్తున్నాయి. అంతేకాదు టిడిపి మరియు టిజెఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తమ మద్దతు తెలిపినట్లు సమాచారం. ఇక మొన్నటి సభలో టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన సోనియా మరియు రాహుల్, ఆ పార్టీ ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని బ్రష్టుపట్టించిందని, అలానే రాష్ట్ర అభివృద్ధి వారి పాలనలో పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. ఇక కేసీఆర్ వంటి అహంకారి రాష్ట్రానికి సీఎంగా పనికిరారని,
ఆ పార్టీలో కేసీఆర్ గారు తమ కుటుంబ సభ్యులకే పదవులిచ్చి పార్టీని పెంచిపోస్తిస్తున్నారని, అదే ఈ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తే అన్నివర్గాల వారికీ సమాన రీతిన పదవులు ఇవ్వడం జరుగుతుందని వారు స్పష్టం చేసారు. అయితే టిఆర్ఎస్ మాత్రం ఎం మహాకూటమి అధికారంలోకి రావడం కల అని, అంతేకాక ఆ కూటమి కేవలం ధనార్జన కోసమే అధికారాన్ని కోరుతున్న విషయం ప్రజలందరికీ తెలుసుననని ఎద్దేవా చేస్తోంది. ఇకపోతే కాంగ్రెస్, టిజెఎస్, టీడీపీ కూటమి మాత్రం తప్పకుండ ఈ ఎన్నికల్లో ప్రజలు తమకు మద్దతిచ్చి అధికారాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం అభ్యర్థులపై కొందరు నెటిజన్లు ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. మొదటినుండి కుమ్ములాటలకు, మరియు గ్రూపు తగాదాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీ, రేపు విజయం తరువాత వీరిపేర్లతో పాటు సీఎం అభ్యర్థులుగా మరికొంత మంది పేర్లు తెరపైకి తెచ్చినా తెస్తుందని ఎద్దేవా చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here