ఢీ జోడిలో డాన్స్ మాస్టర్స్ ని ఉచ్చ పోయిస్తాను అంటున్న గెటప్ శ్రీను….!

0
133
ప్రస్తుతం ఈటివి ఛానల్ లో  విపరీతమైన ప్రేక్షకాధరణతో మరియు మంచి రేటింగ్స్ తో దూసుకెళ్తున్న షోల్లో ఒకటి ఢీ జోడి. ఇక ఈ షో మొదట్లో యాంకర్ గా రష్మీ కి బదులు బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ ని తీసుకున్న షో యాజమాన్యం, కొద్దిరోజుల క్రితం ప్రేక్షకుల నుండి కొంత వ్యతిరేకత రావడంతో మళ్ళి రష్మీ నే ఆమె స్థానంలో తీసుకున్నారు. ఇక ప్రస్తుతం రాబోయే వారానికి సంబందించిన ప్రోమో యూట్యూబ్ లో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఇక ప్రోమోలో ముందుగా జబర్దస్త్ లో తన అదరగొట్టే స్కిట్స్ తో అందరిని ఆకట్టుకునే గెటప్ శ్రీను ఈ వారం షోకి ప్రత్యేక అథితిగా విచ్చేశాడు. ఇక ఎప్పటివలె డాన్సర్లు తమ అదరగొట్టే పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకున్నారు. ఇక ఈ వారం జడ్జీగా ఆనీ మాస్టర్ స్థానంలో జానీ మాస్టర్ షో కి వచ్చి సందడి చేశారు. అయితే ప్రోమోలో ఒక సందర్భంలో బిల్డప్ బాబాయి గా వచ్చిన గెటప్ శ్రీను,  మనం అంటే ఏమనుకున్నావ్, మనం వస్తే అందరూ ఉచ్చపోయాల్సిందే అని చెప్పడంతో షోలోని వారందరు చప్పట్లతో మారుమ్రోగిస్తారు. ఇక ప్రోమోలో బిల్డప్ బాబాయ్ తన గొప్పలు చెప్తుండగా, శేఖర్ మాస్టర్ తనకు పెరుగు కావాలి అని అడగడంతో, ఏంటండీ ఇది మనం వున్నాం కదా, అడగొచ్చుగా నన్ను.. అని ఫోన్ కాల్ చేస్తూ, ఒరేయ్ హైదరాబాద్ కి కొన్ని గేదెలని పంపించు,.
వాటిని పిసికితే బక్కెట్లు బక్కెట్లు పెరుగు వచ్చేయాలి అంతే అనడంతో షో మొత్తం ఈలలు గోలలతో మారు మ్రోగిపోతుంది. ఇక ఆ తరువాత జానీ మాస్టర్ అందుకుని తనకు వెన్నపూస కావలి బాబాయి అనడం, దానికి బిలాప్ బాబాయ్ మాట్లాడుతూ, అది మీకు వెనుకవైపు వుంది చూసుకోండి అని చెప్పడంతో అందరు పగలబడి నవ్వుతారు. ఇక షోలో మరీ ,ముఖ్యంగా కొందరు డాన్సర్లు వేస్తున్న డాన్స్ చూసి బిల్డప్ బాబాయ్, ఇటువంటి డాన్సులు నేను మైఖేల్ జాక్సన్ కి ఎప్పుడో నేర్పాను అనడంతో అక్కడి డాన్సర్లు, ఛా….అవునా, అయితే మరి మైఖేల్ వేసే మూన్ వాక్ స్టెప్ నువ్వు వేసి చూపించు అనగానే, ఒక మూన్ ని చేతిలో పట్టుకుని వెరైటీగా నడుస్తూ, నా చేతిలో ఏముంది అనగానే మూన్ అని అందరూ అంటారు, మరి నేను చేసింది ఏంటి అనగానే వాక్ అని అందరూ చెపుతారు. మరి రెండూ కలిపితే, మూన్ వాకే కదా అని చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తూ నవ్వులు పూయిస్తాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here