అల్లంతో ఈ విధంగా చేస్తే ఒత్తైన నల్లని జుట్టు మీ సొంతం!

0
126
మనం నిత్యం వాడే ఆహారపదార్ధాల్లో అల్లం కూడా ఒకటి. నిజానికి అల్లం ఎక్కువగా తీసుకోవడం వలన మనలోని పైత్య ప్రపొకం తగ్గి జీర్ణ క్రియ బాగా మెరుగుపడుతుంది. అయితే అదే అల్లంతో మన కేశ సంబంధమైన సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చని మీకు తెలుసా. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దానికి కావలిసినవి కొంత స్వచ్ఛమైన లేత అల్లం ముక్క, రెండు మూతల ప్యూర్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్.. ముందుగా అల్లాన్ని చెక్కు తీసుకుని, ముక్కలుగా చేసుకుని, మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకోవాలి. తరువాత దానిని ఒక పల్చటి గుడ్డలో వడకట్టుకుని, పిప్పి తీసేసి వచ్చిన రసాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ ఒక రెండు స్పూన్లు అందులో కలుపుకుని, రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిసిన మిశ్రమాన్ని ఒక చిన్న గాజు సీసాలో పోసి రెండు వారాలపాటు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి. తరువాత దానిని బయటకు తీయగానే అది చాలావరకు గడ్డకట్టినట్లు కనపడుతుంది.
Image result for ginger for hair
అలాంటపుడు ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకుని అందులో ఆ సీసాను వేసి, లోపలి ఆయిల్ కరిగేవరకు అందులోనే ఉంచాలి. ఇక ఆయిల్ కరిగాక, దానిని కొద్దికొద్దిగా తీసుకుని మన జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఇక అప్లై చేసుకున్న మూడు గంటల తరువాత జుట్టును షాంపూతో స్నానం చేయాలి. అయితే ఈ విధంగా వారంలో రెండు నుండి మూడు సార్లు, అంటే నెలలో కనీసం పదిసార్లు కనుక చేయగలిగితే మన జుట్టు రాలిపోవడం, చుండ్రు, తెల్లపొడ వంటివి దూరమవ్వడంతోపాటు జుట్టు కుదుళ్లకు కూడా మంచి పోషణ లభిస్తుందట. ఇక మరెందుకు ఆలస్యం మీరు కూడా కేశ సంబంధ సమస్యలతో కనుక సతమతం అవుతుంటే ఈ అల్లం ఆయిల్ ని తయారు చేసుకుని మీ జుట్టును కూడా కాపాడుకోండి మరి. మనకందరికీ ఎంతో ఉపయోగపడే ఈ చిట్కాపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here