గీతం యూనివర్సిటీ బీటెక్ చెల్లదు…….గందరగోళంలో విద్యార్థులు…మ్యాటర్ ఏంటంటే?

0
96

గీతం యూనివర్సిటీ విద్యార్థుల బీటెక్ డిగ్రీ చెల్లదంటూ ఒక విద్యార్థిని ఎంబీఏ అడ్మిషన్ ను తిరస్కరించిందో కాలేజీ. ఇక అలా ఎందుకు జరిగిందో తెలియక తల పట్టుకుంటున్నారు ఆ విద్యార్థిని తల్లితండ్రులు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారిన ఆ న్యూస్ ఏంటంటే,  2014లో ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థిని ఈ ఏడాదే కోర్సు పూర్తి చేసుకుంది. అనంతరం కరీంనగర్‌లోని ఓ ఎంబీఏ కాలేజీలో యాజమాన్య కోటాలో అడ్మిషన్‌ తీసుకుంది. నిబంధనల ప్రకారం యాజమాన్య కోటా అడ్మిషన్లను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ధ్రువీకరించాలి. ఇందులో భాగంగానే కాలేజీ యాజమాన్యం ఆ విద్యార్థిని సమర్పించిన సర్టిఫికెట్లను మండలి అధికారులకు అందజేసింది. గీతం వర్సిటీ నుంచి అందిన బీటెక్‌ సర్టిఫికెట్‌ చెల్లదని అధికారులు తేల్చి ఆ సర్టిఫికెట్‌ను తిరస్కరించి,ఎంబీఏలో అడ్మిషన్‌ను కూడా నిరాకరించారు. దీంతో ఆ విద్యార్థిని పరిస్థితి అయోమయంగా మారింది. నిజానికి  గీతం హైదరాబాద్‌ క్యాంప్‌సను 2009లో ఏర్పాటు చేశారు.

Image result for gitam university hyderabad

అప్పటి నుంచి సాంకేతిక కోర్సులతో పాటు ఇతర కోర్సులను విద్యార్థులకు అందిస్తోంది. గీతం యూనివర్సిటీ యాజమాన్యం అందించిన ఆధారాల ప్రకారం వర్సిటీకి ఏఐసీటీఈ అనుమతి లేదని, అందుకే సాంకేతిక కోర్సులు కొనసాగించే అర్హత వర్సిటీకి లేదని అధికారులు తెలిపారు. 2007 సంవత్సరంలో విశాఖపట్నంలో గీతమ్‌ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ(ఎంహెచ్‌ఆర్‌డీ) ఇచ్చిన నోటిఫికేషన్‌ను అధికారులు ఆధారంగా చూపుతున్నారు. ఇక ఈ యేడాది ఏఐసీటీఈ అనుమతి పొందిన డీమ్డ్‌ వర్సిటీల జాబితాను కూడా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేవలం మూడు వర్సిటీలు మాత్రమే ఉన్నాయి. అవి ఐఐఐటీ-హైదరాబాద్‌, కేఎల్ యూనివర్సిటీ, ఇక్ ఫై  వర్సిటీ. అయితే ప్రముఖ వర్సిటీలుగా పేరొందిన గీతమ్‌, సింఘానియా, ఎమిటీ, సింబియాసిస్‌ వర్సిటీల పేర్లు జాబితాలో లేకపోవడంతో ఈ అంశంపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం  ఏడు డీమ్డ్‌ వర్సిటీలకు లేఖ రాసింది.
Image result for gitam university hyderabad
సాంకేతిక కోర్సులు కొనసాగించేందుకు వారి వద్ద ఉన్న అనుమతి పత్రాలు అందించాలని కోరింది. అన్ని వర్సిటీలు స్పందించాయి. అయితే  యూజీసీ, ఏఐసీటీఈతో పాటు వాటి మాతృ సంస్థల నిబంధనలు పాటించాలని కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. ఇక ఆ నిబంధనలు పాటించని గీతం యూనివర్సిటీ నుండి బీటేక్ చేసిన ఆ విద్యార్థిని సర్టిఫికెట్ ని తిరస్కరించామని అధికారులు అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయం తెరపైకి రావడంతో ఈ పరిణామంతో ఏం జరుగబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తం విద్యార్థుల సర్టిఫికెట్లు రద్దు చేస్తారా? లేక ఏదైనా ప్రమాణికం తీసుకుంటారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం పొందిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనిపై  తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుని, విద్యార్థులకు ఎటువంటి భరోసా ఇస్తుందో తెలియాలంటే మరికొద్దిరోజలు వేచి చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here