చెత్త వేస్తే, వేడివేడి టీ ఇచ్చే ఏటీఎం మిషన్……… మ్యాటర్ కోసం ఇది చూడండి!

0
74
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తరువాత భారత దేశాన్ని పచ్చదనం మరియు పరిశుభ్రత గల దేశంగా మార్చాలి అనేదే తన ద్యేయంగా చెప్పారు. ఇక అందులో భాగంగా స్వచ్ఛ మిషన్, స్వచ్ఛ దాన్ పేర్లతో పలు పారిశుధ్య కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మొదలెట్టారు. ఇక ప్రస్తుతం కుంభమేళాలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో  భాగంగా ప్రయోగాత్మకంగా  ఒక టీ, ఏటీఎంను అధికారులు ఏర్పాటు చేశారు. దీని విశేషమేమింటే, చెత్త లేదా పనికిరాని బాటిళ్లను ఈ మెషీన్‌లో వేస్తే, మనకు వేడి వేడి టీ ని అది అందిస్తుంది. అత్యంత  ప్రతిష్టాత్మకంగా భావించే ఈ  కుంభమేళాకు  కోట్లాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో నగర  పరిశుభ్రతను, పర్యావరణాన్ని కాపాడేందుకు  అక్కడి అధికారులు ఇన్నోవేటివ్‌ ఐడియా తో ఈ విధంగా ముందుకు వచ్చారు.
Unique ATM Machine at KUMBH Get Hot tea by Inserting  Garbage into the Slot - Sakshi
అయితే ఈ కార్యక్రమంతో అటు పుణ్యం, ఇటు పురుషార్ధం రెండూ దొరుకుతాయంటున్నారు పలువురు. ఇక కుంభమేళాలో చలితో వణకుతున్న భక్తులకు వేడి వేడి టీ ఉపశమనాన్ని ఇవ్వడంతోపాటు, నగర శుభ‍్రతకు కూడా ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.  కుంభమేళాలో ఇలాంటి  తొలిసారిగా ఇలాంటి ఏటీఎం ను వాడుతున్నామని, ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్‌ ద్వారా ఈ మెషీన్‌ పనిచేస్తుందని  చెప్పారు. అయితే ఇటువంటి తరహా మిషన్లను దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడ ప్రవేశపెడితే బాగుంటుందని పలువురు ప్రజలు అభిప్రాయపడుతున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here