సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కు పండుగ న్యూస్!

0
108
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ మరియు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రఖ్యాత మైనపు బొమ్మల మ్యూజియమ్ మేడమ్ టుస్సాడ్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపుబొమ్మను చాలా రోజుల క్రితమే పెట్టారు.  సింగపూర్ లో ఉన్న ఈ వ్యాక్స్ స్టాచ్యూను త్వరలో భాగ్యనగరానికి ఒకరోజు సందర్శనార్థం తీసుకురానున్నారట. మహేష్ బాబుకు భాగస్వామ్యం ఉన్న ఏఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్ లో ఈ మైనపుబొమ్మను ఒకరోజు పాటు ఉంచాలని ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఆ మైనపు బొమ్మను ఎలా జాగ్రతగా ఇక్కడకు తీసుకురావాలి, అలానే ఏమాత్రం డ్యామేజ్ జరగకుండా తిరిగి సింగపూర్ కు తీసుకెళ్ళి యధాస్థానంలో ఉంచాలి అనే దిశగా ప్లాన్ చేస్తున్నారట. వాళ్ళ షెడ్యూల్ కనుక ఫైనలైజ్ అయితే సూపర్ స్టార్ మైనపు బొమ్మను అతి త్వరలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారని, ఇక ఆ వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తారని సమాచారం. మహేష్ మైనపు బొమ్మతో ఫోటోలు తీసుకొనే అవకాశం ఉంటుంది కాబట్టి అభిమానులకు ఇది నిజంగానే ఒక గ్రేట్ న్యూస్. ఒకరోజు సందర్శన పూర్తయిన తర్వాత మైనపు బొమ్మను మొదట సింగపూర్ కు తీసుకెళ్లి, అక్కడి నుంచి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రధాన కార్యాలయం ఉన్న లండన్ కు తరలిస్తారని సమాచారం. ఇక ఈ వార్త బయటకు రావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ పండుగ సంబరాల్లో మునిగిపోయారు…….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here