కరెంటు బిల్లు కట్టే వారికి శుభవార్త…….చూడకపోతే ఎంతో నష్టపోతారు!

0
155
ప్రస్తుతం కంప్యూటర్, మొబైల్ ఫోన్ వంటి డిజిటల్ మాధ్యమాల వినియోగం ఎక్కువ అవడంతో దాదాపుగా ప్రతిఒక్క చెల్లింపును ప్రజలు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారానే చెల్లించడానికి ఇష్టపడుతున్నారు. నిజానికి ఈ విధమైన పద్దతుల ద్వారా కరెంట్ బిల్, టెలిఫోన్ బిల్, సెల్ ఫోన్  రీచార్జి, సినిమా, రైలు, బస్సు టిక్కెట్ల బుకింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన చెల్లింపులు ఈ విధంగానే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక కరెంట్ బిల్ ని కూడా ఎక్కువ మంది ఆఫీస్ కి వెళ్లేకంటే ఆన్లైన్ ద్వారానే కడుతున్నారు. అయితే ఇటీవల కొందరికి వాడిన దానికంటే ఎక్కువ బిల్ వస్తోంది అనే కంప్లైంట్ లు కూడా అక్కడక్కడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే ఈ డిజిటల్ యుగంలో వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ప్రభుత్వం కూడా నూతనపోకడలతో సరికొత్త పద్దతులను తీసుకువస్తోంది.
Related image
ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 2019నుండి కేంద్ర ప్రభుత్వం ప్రీ పెయిడ్ కరెంటు బిల్లు చెల్లింపు విధానాన్ని తీసుకువచ్చే యోచన చేస్తోందట. దీనిప్రకారం ఇకపై మనం వినియోగించే కరెంటుకు సంబంధించి నెలసరి బిల్లు ముందుగానే చెల్లించి కరెంట్ వినియోగించుకోవచ్చు అన్నమాట. అంటే మనలో దాదాపుగా ప్రతిఒక్కరికి మనకు నెల నెలా ఎంత బిల్ వస్తుందో అంచనా ఉంటుంది కాబట్టి దాదాపుగా అంత మొత్తానికి ముందే ప్రీపెయిడ్ గా చెల్లింపు చేస్తే దానిని ఆ నెల మొత్తం వాడుకోవచ్చట. దీనిద్వారా ఎక్కువగా కరెంట్ కాల్చుకుని వారికి చెక్ పెట్టడంతో పాటు, తప్పుడు బిల్లులు మరియు అత్యధిక బిల్లులు వచ్చే ప్రమాదం బారిన పడకుండా ఉండవచ్చని ప్రభుతం ఈ విధానాన్నీ తీసుకురానుంది. అయితే బిల్లు చెల్లింపుకు ప్రీపెయిడ్ కార్డులు,
Related image మరియు ఆ మేరకు ప్రతి ఇంటికి డిజిటల్ స్మార్ట్ కరెంట్ మీటర్లు ఏర్పాటు చేయనుందట ప్రభుత్వం. ఇక ప్రీపెయిడ్ కార్డుల ద్వారా ముందస్తుగా బిల్లు చెల్లింపు చేయడంతోపాటు, స్మార్ట్ మీటర్ల ద్వారా దానినుండి మన సెల్ ఫోన్ ద్వారా బిల్ చెల్లింపు చేయవచ్చట. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి అయిందని, అయితే ఈ పధకాన్ని దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఏప్రిల్ నుండి అమల్లోకి తీసుకురానుందట కేంద్ర ప్రభుత్వం. ఈ విధానం మంచి సక్సెస్ అయితే ప్రజలకు మరింత చేరువవ్వొచ్చు అనేది కూడా ప్రభుత్వ ఆలోచన అట. అయితే ఈ పద్ధతి ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాలి మరి…….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here