వెంకీ కూతురు ఎంగేజ్మెంట్  లో సమంతను చూసి షాకైన అతిథులు!

0
71
ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత, ఆ సినిమాతోనే నాగచైతన్య తో ప్రేమలో పడి, చివరికి ఎట్టకేలకు అక్కినేని వారి ఇంటి కోడలు అయింది. ఇక పెళ్లి తరువాత ప్రస్తుతం భర్త చైతన్యతో కలిసి మజిలీ సినిమాలో నటిస్తోంది సమంత. ఇక నిన్న విక్టరీ వెంకటేశ్ కుమార్తె అశ్రిత నిశ్చితార్థం హైదరాబాద్ లో జరుగగా, ఈ వేడుకకు సమంత హాజరైంది. ఈ సందర్భంగా తాను ఎలా మేకప్ చేసుకుని వెళ్లానన్న విషయాన్ని,
Image result for samantha ruth prabhu
సమంత తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసింది. ఏక్యా బెనారస్ డిజైనర్ శారీలో మెరిసిపోయిన సమంత, కృష్ణ దాస్ జ్యూయెలరీ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్న బంగారు ఆభరణాలను ధరించింది. ఆమెకు సాధనా సింగ్ మేకప్ చేయగా, జుకాల్కర్ హెయిర్ స్టయిల్ చేశారట. నిశ్చితార్థానికి వచ్చిన ఆమె, పలు వెరైటీల్లో ఫొటోలకు పోజులిచ్చింది. అంత అందమైన చీరలో వున్న ఆమెను చూసిన అతిథులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. ఇక ఆమె తాజా చిత్రం ‘సీమరాజా’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉందన్న సంగతి తెలిసిందే. అయితే సమంత వేసుకువచ్చిన నగలు, మరియు శారీ అదిరిపోయింది అంటూ పలువురు ఫ్యాన్స్ ఆమెకు సోషల్ మీడియా వేదికల్లో అభినందనలు తెలుపుతున్నారు …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here