ఫ్లోరిడాలో ఓ వింత యాక్సిడెంట్ ……

0
48

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. హెలికాఫ్టర్ ను ఢీ కొన్న వ్యాన్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. హెలికాఫ్టర్ ఆకాశంలో ఎగురుతుంది కదా వ్యాన్ ఏమో రోడ్డు మీద నడుస్తుంది. వీటికి ఎలా యాక్సిడెంట్ జరుగుతుంది అనే అనుమానం మీకు రావచ్చు. అయితే ఇది చదవండి. గురువారం ఫ్లోరిడాలో ఇద్దరు ప్రయాణికులతో వెళ్తున్న చిన్న హెలికాఫ్టర్ కొన్ని సాంకేతిక లోపం వచ్చింది. ధీమాతో పైలెట్ దానిని రోడ్డు పైకి దించాడు.

హెలికాఫ్టర్ రోడ్డుపై నెమ్మదిగా వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన ట్రక్కు దాన్ని ఢీ కొట్టింది. దాని రెక్కలు విరిగి వాహనంలోకి దూసుకెళ్లడంతో ఆ ట్రక్కు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ హెలికాఫ్టర్ రెక్కలు బాగా దేబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో జాతీయ రహదారి పై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రక్కనే పవర్ ప్లాంట్ ఉండడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హెలికాఫ్టర్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. హెలీకాప్టార్ ను ఢీ కొన్న ఈ ఘటన ఈ ప్రాంతంలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here