త్రివిక్రమ్ పై హేమ సంచలన వ్యాఖ్యలు… వైరల్ అవుతున్న న్యూస్!

0
114
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ పై ప్రముఖ లేడీ కమెడియన్ హేమ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. నిజానికి త్రివిక్రమ్ తీసిన అతడు, జులాయి, అత్తారింటికి దారేది సినిమాల్లో హేమకు మంచి పాత్రలే ఇచ్చారు త్రివిక్రమ్, అంతేకాదు ఇదివరకు కొన్ని ఇంటర్వ్యూల్లో తనకు త్రివిక్రమ్ గారంటే కొంత ప్రత్యేక గౌరవం అని చెప్పిన హేమ, నిన్న ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆయనపై ఫైర్ అయ్యారు. ఇటీవల ఒక సినిమా షూటింగ్ సమయంలో త్రివిక్రమ్ గారు,
Image result for trivikram and hema
హేమకు ఇంతవరకే రెమ్యూనరేషన్ ఇవ్వండి అంటూ కొన్ని సూచనలిచ్చారట. అయినా నా రెమ్యూనరేషన్ పై అయన వ్యాఖ్యానించడం ఏంటి, నాకు వున్న మార్కెట్ వేల్యూ ని బట్టి నిర్మాతలు రెమ్యూనరేషన్ నిర్ణయిస్తారు, అంతేకాని దాని విషయంలో అయన జోక్యం అనవసరమని ఫైర్ అవుతూ మాట్లాడారు. ఇక హేమ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో కొంత కలకలాన్ని సృష్టిస్తుండగా, కొందరు త్రివిక్రమ్ అభిమానులు ఆమెపై సోషల్ మీడియా వేదికల్లో తీవ్ర ఆగ్రహంతో కామెంట్స్ చేస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here