పవన్ పై ఉన్న ప్రేమ తో జనసేన పార్టీ కి భారీ మొత్తం విరాళం ఇచ్చిన హీరో…….

0
34

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తనకున్న పిచ్చి ప్రేమ, భక్తిని మరోసారి చాటుకున్నాడు.హీరో నీతిన్  అభిమాన నటుడు రాజకీయలోకి అడుగుపెట్టడంతో భారీ విరాళాన్ని అంధ జేశారు. అభిమానానికి ప్రాంతంతో సంభంధం లేదని తెలంగాణకు చెందిన నితిన్ … ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ఖర్చుల నిమ్మితం తనవంతు సహాయాన్ని అందించారు హీరో నితిన్. జనసేనకు నితిన్ రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు పార్టీ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. నితిన్ అందుబాటులో లేకపోవడం వాళ్ళ ఆయన తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి స్వయంగా చెక్కును పవన్ కళ్యాణ్ కు అందజేశారు.

సోమవారం రాత్రి భీమవరంలో పవన్ కళ్యాణ్ కలిసిన ఎన్. సుధాకర్ రెడ్డి ఆయనకు చెక్ ను అందజేశారని సమాచారం. డీ హైడ్రేషన్ వాళ్ళ అస్వస్థతకు లోనైనా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి సుధాకర్ రెడ్డి అడిగి తెలుకున్నారు. పవన్ ని ఆరాధించే నీతిన్ తన సినిమాల్లో ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తేవడానికి ప్రయత్నిస్తాడు. తన సినిమాల్లో ఒక్కసారైనా పవన్ ప్రస్తావన తేవడానికి ఇష్టపడతారు. నితిన్ హీరోగా త్రివిక్రమ్ పవన్ నిర్మతలుగా` అ ఆ ` సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక నీతి సినిమాల విషయానికి వస్తే ఒక్కప్పుడు వరుస హిట్లు కొట్టిన హీరో … లై , చల్ మోహనరంగా , శ్రీనివాసకల్యాణం వరుస ప్లాప్ లహాతో డీలా  పడ్డాడు. ` భీష్మ ` ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here