ప్రపంచంలో భారీ మెగా పిక్సెల్ కెమెరా ఫోన్ ని రిలీజ్ చేసిన హానర్… చూస్తే మతి పోతుంది!

0
124
ప్రస్తుతం ఎక్కువగా రోజుకోరకం గ్యాడ్జెట్ మార్కెట్ లోకి వచ్చి సంచలనం రేపుతున్నాయి. ఇక యూత్ కూడా ఎక్కువగా ఒకే రకం మొబైల్స్ వంటివి ఎక్కువ కాలం వాడడానికి ఇష్టం చూపించడం లేదు. ఎప్పటికపుడు మార్కెట్ లోకి వస్తున్న కొత్త మొబైల్స్ ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇక ప్రస్తుతం మొబైల్స్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని మొబైల్ సంస్థలు కూడా రకరకాల మొబైల్స్ ని రిలీజ్ చేస్తూ కస్టమర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం చైనా స్మార్ట్‌ఫోన్‌మేకర్‌ హువావే సబ్‌ బ్రాండ్‌  హానర్‌ భారీ కెమెరాతో  ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది.  48 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్‌ 589 సెన్సర్‌తో  హానర్‌ వ్యూ 20 / హానర్‌  వి 20 పేరుతో రెండు వెర్షన్స్ ని జనవరి 29న భారత మార్కెట్లో లాంచ్‌ చేయనుంది. గత నెలలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో  ఆవిష్కరించింది ఈ సంస్థ. ఇక ప్రపంచంలో ఇంత మెగా పిక్సెల్ తో వస్తున్న మొబైల్ కావడంతో కస్టమర్స్ దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాక ఇది కేవలం రూ.35,000 ధరలో లభ్యం కావడంతో దీనికి డిమాండ్ మరింత పెరిగింది.
Honor View 20 with display cutout, 48MP camera to launch on 29 January - Sakshi
హానర్‌  వి 20 ఫీచర్లు చూస్తే…. 6.4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే 2130×1080 రిజల్యూషన్‌,  హై సిలికాన్‌ కిరిన్‌ 980  ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ పై 9 ఆపరేటింగ్ సిస్టం, 6జీబీ/8జీబీ ర్యామ్‌, 128జీబీ/256 స్టోరేజ్‌, 48 మెగా పిక్సెల్ రియర్‌కెమెరా, 25 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా మరియు  4000ఎంఏహెచ్‌ బ్యాటరీ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here