మెగా హీరోలకు 2018వ సంవత్సరం ఎలాంటి జోష్ ని ఇచ్చింది!

0
113
ఈ ఏడాది మెగా ఫ్యామిలీ నుండి దాదాపుగా  అందరూ హీరోల నుండి సినిమాలు వచ్చాయి. అయితే కేవలం రామ్ చరణ్, మరియు వరుణ్ తేజ లకు మాత్రమే ఈ సంవత్సరం మెగానామ సంవత్సరంగా కలిసివచ్చింది అని చెప్పవచ్చు. ఇక వివరాల్లోకి వెళితే ఈ సంవత్సరం ప్రారంభంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి, అయన కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ సినిమా చరిత్రలో అత్యధిక లాస్ వచ్చిన సినిమాగా మిగిలిపోయింది. పవర్ స్టార్ మరియు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో కేవలం మెగా అభిమానులు మాత్రమే కాదు, తెలుగు సినిమా ప్రేక్షకులు అందరూ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే అనూహ్యంగా ఆ సినిమా ఫ్లాప్ కావడంతో అయన ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. ఇక మార్చ్ లో రామ్ చరణ్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి మెగా అభిమానులకు పండుగ తీసుకువచ్చింది.
Image result for mega family heroes
ఆ తరువాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ జనవరిలో ఇంటెలిజెంట్ గా మన ముందుకు వచ్చి ఫ్లాప్ అందుకున్నారు. అంతేకాదు జులై లో తేజ్ ఐ లవ్ యు పేరుతో కూడా ఒక సినిమా చేసి మరొక ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పోతే వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ హిట్ ని అందుకోగా, ఇటీవల విడుదలైన అంతరీక్షం పర్వాలేదనిపించింది. ఇక అల్లు అర్జున్ హీరోగా మే లో వచ్చిన నా పేరు సూర్య కూడా అంచనాలు అందుకోలేక ఫ్లాప్ అయింది. ఇక అల్లు శిరీష్ చేసిన ఒక డబ్బింగ్ సినిమా యుద్ధం కూడా ఫ్లాప్ గానే మిగిలిపోయింది. ఇక మెగాస్టార్ చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా చేసిన విజేత సినిమా కూడా అంచనాలను అందుకోవడంలో విఫలమయింది. ఈ విధంగా 2018వ సంవత్సరం మెగా అభిమానులకు పెద్దగా కిక్ ఇవ్వలేదనే చెప్పాలి.  మరి రాబోయే 2019 అయినా మెగా హీరోలకు మంచి హిట్స్ లభించి వారి ఫ్యాన్స్ ని ఖుషి చేయాలనీ ఆశిద్దాం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here